E-Paper
Advertisement

Tanveer Ahmed: మీరు మగాళ్లైతే రండి.. IPL వదిలేసి, PSL ఆడండి, ఇండియ‌న్స్ కు తన్వీర్ స‌వాల్ !

Tanveer Ahmed: మీరు మగాళ్లైతే రండి.. IPL వదిలేసి, PSL ఆడండి, ఇండియ‌న్స్ కు తన్వీర్ స‌వాల్ !
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( Pakistan Super League Tournament ) రెండు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం పేరు నమోదు చేసుకున్న విదేశీ క్రికెటర్లు వరుసగా ఐపీఎల్లోకి జంప్ అవుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) సతమతమవుతోంది. అయితే , ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఐపీఎల్ అంటే మ్యాచ్ ఫిక్సింగ్ లీగ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఇండియన్ క్రికెటర్లకు సవాల్ విసిరారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్. మీరు నిజంగా మగాళ్లు అయితే ఐపీఎల్ వదిలేసి పాకిస్తాన్ సూపర్ లీగ్ లోకి రావాలంటూ బాంబు పేల్చారు. ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ మెరుగైనదని వ్యాఖ్యానించారు. దీంతో తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read : Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్

IPL వదిలేసి, PSL ఆడండి, ఇండియ‌న్స్ కు తన్వీర్ స‌వాల్ !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇండియన్స్ ను ఉద్దేశించి తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ, రోహిత్ శర్మ లాంటి క్రికెటర్లు అందరూ ఐపిఎల్ టోర్నమెంట్ వదిలేసి పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి రావాలని కోరారు. ఐపీఎల్ లో కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ చాలా పెద్దదని, ఇందులో ఆడితే ఇండియన్ క్రికెటర్లకు వ్యాల్యూ మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

ఈ సారి ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తమ టోర్నమెంట్ కు ఎలాంటి డోకా లేదన్నారు. నాణ్యతలేని ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ చాలా బెటర్ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మగాళ్లు అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ లోకి రావాలని ఇండియన్ క్రికెటర్లకు సవాల్ విసిరారు తన్వీర్ అహ్మద్.

Advertisement

ఇక అదే సమయంలో షాహిద్ ఆఫ్రీది అల్లుడు షాహీన్ అఫ్రిది కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పెద్ద లీగ్ అని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ కంటే ఈసారి వ్యూయర్షిప్ ఎక్కువగా తమ టోర్నమెంట్ కు వస్తుందని తెలిపారు. ప్రేక్షకులు లేకున్నా, టీవీల్లో ఎక్కువమంది చూసే వాళ్ళు ఉన్నారన్నారు.

 

Also Read : Rajasthan Royals Sold: ప‌నికిరాని షేర్లు కొని, త‌న పిల్లలకు రూ.460 కోట్ల ఆస్తి సంపాదించిన షేన్ వార్న్..సన్నాఫ్ సత్యమూర్తి రేంజ్ లో

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×