E-Paper
Advertisement

Tanveer Ahmed: పాకిస్తాన్ కెప్టెన్సీ కోసం 11 మంది త‌న్నుకుంటున్నారు..ఇక బంగ్లాపై ఎలా గెలుస్తారు

Tanveer Ahmed: పాకిస్తాన్ కెప్టెన్సీ కోసం 11 మంది త‌న్నుకుంటున్నారు..ఇక బంగ్లాపై ఎలా గెలుస్తారు
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League 2026 Tournament) ఒక వైపు కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ( Pakistan vs Bangladesh) మధ్య టెస్టు సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో చెత్త ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ అయింది. ఆడిన రెండు టెస్టుల్లో దారుణంగా ఓడిపోయింది. నిన్నటితో ముగిసిన ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఆ దేశం మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) కూడా రియాక్ట్ అయ్యారు.

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

పాకిస్తాన్ కెప్టెన్సీ కోసం 11 మంది త‌న్నుకుంటున్నారు

Advertisement

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం చారిత్రాత్మక సంఘటన అంటూ సీరియస్ అయ్యారు. పసికూన‌ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోతే, ఇండియా లాంటి బలమైన జట్లపై ఎలా గెలుస్తారని నిలదీశారు. పాకిస్తాన్ జట్టులో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయని.. టెస్ట్ కెప్టెన్సీ కోసం 11 మంది పోటీ పడుతున్నారని బాంబు పేల్చారు. కెప్టెన్సీ కోసం అందరూ పోటీ పడుతున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ టైటిల్ గెలుచుకుందని సెటైర్లు పేల్చారు. ఇలాగే పాకిస్తాన్ ప్లేయర్లు ఆడితే… క్రికెట్ చూడడమే అభిమానులు మానేస్తారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ ను తొలగించేలా అందరూ కుట్రలు చేస్తున్నారని… ఆ సీట్లో కూర్చునేందుకు మిగతా ప్లేయర్లందరూ ప్రయత్నాలు చేస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు త‌న్వీర్ అహ్మ‌ద్. దాని వల్ల బంగ్లాదేశ్ జట్టును ఫోకస్ చేయలేకపోయారని సెటైర్లు పేల్చారు. ఇక కెప్టెన్ షాన్ మసూద్ కు ఏది చేతకావడం లేదని ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా అతను చేతులెత్తేసాడని సీరియస్ అయ్యారు. రివ్యూ తీసుకోవడంలో కూడా విఫలమయ్యాడని ఆగ్రహించారు.

ఇలాంటి ఆటగాడు కెప్టెన్ అయితే పాకిస్తాన్ పరువు గంగలో కలవడం గ్యారెంటీ అంటూ బాంబు పేల్చారు తన్వీర్ అహ్మద్. వైట్ వాష్ కాకుండా 1-0 తేడాతో బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే పెద్ద సమస్య వచ్చేది కాదన్నారు. ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోయిందని సీరియస్ అయ్యారు. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా బాధ్యత తీసుకొని చివరి వరకు ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్ళం అన్నారు. ఇక ఇదే అంశంపై రమీజ్ రాజా కూడా మండిపడ్డారు. బంగ్లాదేశ్ ప్లేయర్లను.. ఆస్ట్రేలియా ఆటగాళ్లుగా పాకిస్తాన్ భావించిందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాను చూసి ఆస్ట్రేలియా ప్లేయర్లు వణికిపోయారని తెలిపారు. దీంతో ఓటమిపాలైనట్లు వివరించారు. అర్ధరాత్రి కూడా బంగ్లాదేశ్ ప్లేయర్లను తలుచుకొని పాకిస్తాన్ ప్లేయర్లు భయపడిపోతున్నారని బాంబు పేల్చారు.

Advertisement

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

 

Related News

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

ఓరేయ్ వైభ‌వ్..నువ్వు మ‌గాడివైతే జింబాబ్వేపై సెంచ‌రీ కొట్టు !

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

టీమిండియా చేతిలో ఓడినందుకు మాపై కుళ్ళిన గుడ్లు, టమోటాలు విసిరారు

పాకిస్తానోడి సిక్స‌ర్లు..కావ్య పాప సంబ‌రాలు…మ‌ళ్లీ దేశ‌ద్రోహి అంటూ పోస్టులు

Big Stories

Advertisement
×