Aaqib Javed On IND VS PAK: పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (Pakistan vs Team India) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరిగితే, వ్యూయర్షిప్ కూడా అదిరిపోతుంది. అందుకే ఐసీసీ టోర్నమెంట్ జరిగితే కచ్చితంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహిస్తారు. దీంతో ఐసీసీ అలాగే ఇరుజట్ల క్రికెట్ బోర్డులకు ఆదాయం ఫుల్లుగా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై సెలెక్టర్ ఆకిబ్ జావేద్ (Aaqib Javed) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1996 సంవత్సరంలో జరిగిన ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ లో ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిందని… ఈ నేపథ్యంలో తమపై కుళ్ళిన కోడిగుడ్లు, టమోటాలు విసిరారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో విమానాశ్రయం నుంచి దొంగ చాటున ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు. దీంతో ఒకప్పటి పాక్ బౌలర్ ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
1996 సమయంలో వన్డే ప్రపంచకప్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో క్వార్టర్స్ ఫైనాన్స్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మార్చి 9వ తేదీన మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 39 పరుగుల తేడాతో పాకిస్తాన్ క్రికెట్ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లు ఆడి 287 పరుగులు సాధించగలిగింది. నవజ్యోతి సింగ్ సిద్దు 93 పరుగులు చేయగా అజయ్ జడేజా 45 పరుగులతో రాణించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ తలబడి… 248 పరుగులకు కుప్పకూలింది. అయితే ఆ సమయంలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమిని దేశ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
1996 సంవత్సరంలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన విషయాన్ని గుర్తిస్తూ అప్పటి బౌలర్ ఆకిబ్ జావేద్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా చేతిలో ఓడిపోయినందుకు గాను… పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు తమపై దాడులు చేశారన్నారు. విమానాశ్రయంలో కుళ్ళిపోయిన కోడిగుడ్లు, టమాటోలతో తమపై దాడులు చేశారని వెల్లడించారు. దీంతో దొంగ చాటున విమానాశ్రయం నుంచి ఇండ్లకు చేరుకున్నట్లు తెలిపారు. గతంలో టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్… ఇప్పుడు కూడా గెలవలేని పరిస్థితిలో ఉందని ఆయన తెలిపారు. 2027 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో తమ జట్టు గెలుస్తుంది అన్న నమ్మకం తనకైతే లేదన్నారు.