BigTV English

NTR: కొమురంభీంను కలిసిన టీమిండియా.. ఎందుకంటే..!

NTR: కొమురంభీంను కలిసిన టీమిండియా.. ఎందుకంటే..!

NTR: ఇప్పుడు భారత్ లో రెండే టాపిక్స్. ఒకటి ఆర్ఆర్ఆర్ కు ప్రతిష్టాత్మక అవార్డులు. ఇంకొకటి టీమిండియా రికార్డు విజయాలు. లేటెస్ట్ గా ఈ రెండూ కలిసి ఒకే ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఆర్ఆర్ఆర్ హీరో ఎన్టీఆర్.. టీమిండియా యంగ్ ప్లేయర్స్ ఓచోట చేరి సరదాగా గడిపారు. వారంతా ఎక్కడ కలిశారు? ఎందుకు కలిశారు? అంటే….


న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌ ఆడేందుకు భారత జట్టు హైదరాబాద్‌కు వచ్చింది. ప్రాక్టీస్‌ సెషన్ నడుస్తోంది. బుధవారం మ్యాచ్ కావడంతో ఆటగాళ్లకు కాస్త టైం దొరికింది. అయితే, ఇండియన్ టీమ్ లో పలువురు క్రికెటర్లకు హైదరాబాదీ కార్ కలెక్షన్ కింగ్ నజీర్ ఖాన్ మంచి స్నేహితుడు. ఇటీవల అతను ఇండియాలోకే ఖరీదైన కారును కొన్నాడు. ఆ కారును, దాంతో పాటు నజీర్ ఖాన్ సూపర్ కార్స్ కలెక్షన్ ను చూద్దామని అతని ఇంటికి వెళ్లారు. అక్కడ వారంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా.. మధ్యలో RRR ప్రస్తావన వచ్చింది.

RRR హీరో ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ నజీర్ ఖాన్ చెప్పడంతో టీమిండియా ప్లేయర్స్ మరింత ఆసక్తి కనబరిచారు. ఓసారి కలిపించమని అడిగితే.. ఎన్టీఆర్ ను తన ఇంటికి ఆహ్వానించాడు నజీర్. అలా.. అతని ఇంట్లో ఇటు కొమురం భీం.. అంటు టీమిండియా యంగ్ టీమ్.. అంతా కలిసి సరదా సరదాగా గడిపారు. ఆ తర్వాత పార్టీ ఎలానూ ఉంటుందనుకోండి…


ఎన్టీఆర్ ను కలిసిన సూర్యకుమార్‌ యాదవ్‌, శుబ్‌మన్ గిల్, ఇషాన్‌ కిషన్, యుజ్వేంద్ర చాహల్, శార్దూల్‌ ఠాకూర్‌లు సెల్ఫీలు దిగి సందడి చేశారు. క్రికెటర్లతో తమ అభిమాన నటుడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. తన వైఫ్ దేవిషా శెట్టితో కలిసి ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోను సూర్యకుమార్‌ యాదవ్‌ ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘నాటు-నాటు’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు చెప్పాడు సూర్యకుమార్‌ యాదవ్‌. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×