E-Paper
Advertisement

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేక‌పోతే, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేము

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేక‌పోతే, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేము
Advertisement

Munaf Patel: టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ ( Virat Kohli), రోహిత్ శర్మలపై (Rohit Sharma) మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ (Munaf Patel ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు క్రికెటర్లు టీమిండియాలో లేకపోతే.. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ గెలవడం కష్టమేనని బాంబు పేల్చాడు. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ లను సెలెక్ట్ చేయకుండా వరల్డ్ కప్ నకు ( 2027 ODI World Cup) వెళితే, గ్రూప్ స్టేజిలోనే టీమ్ ఇండియా ఎలిమినేట్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ చేతిలో టీమిండియా వరుసగా ఓటమి పాలవుతున్న నేపథ్యంలో… మునాఫ్ పటేల్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేక‌పోతే, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేము

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 ODI World Cup)  నేపథ్యంలో ఇప్పటినుంచే టీమ్ ఇండియాను గాడిలో పెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. సీనియర్ క్రికెటర్లు ఎవరు ఉండాలి ? ఎవరు బయటకు వెళ్లాలి ? కుర్ర క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వాలా ? ఇస్తే ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి ? అనే అంశాలపై కసరత్తులు ప్రారంభించింది. అయితే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని తప్పిస్తానని సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది. ఇలాంటి క్రమంలో 2027 వన్డే వరల్డ్ కప్ పైన మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ (Munaf patel) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంటులో ఉండాల్సిందేనని తెలిపారు.

రోహిత్, కోహ్లీ అనుభ‌వం టీమిండియాకు అవ‌స‌రం – మునాఫ్‌

ఈ ఇద్దరు క్రికెటర్లకు 40 సంవత్సరాలు కావొచ్చింది.. కానీ యంగ్ క్రికెటర్ల తరహాలోనే వెళ్ళు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా… విరాట్ కోహ్లీ అద్భుతంగా రాని నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఛాంపియన్ గా నిలిపాడని గుర్తు చేశారు. ఇటు రోహిత్ శర్మ కూడా గతంలో కంటే ఫిట్ గా కనిపిస్తున్నాడన్నారు. కుర్రాడిలా తయారయ్యాడని ప్రశంసల వర్షం కురిపించారు. ఇద్దరి అనుభవం టీమిండియా కు కచ్చితంగా ఉండాలన్నారు. వీళ్లిద్దరిని పక్కకు పెట్టి బీసీసీఐ పెద్ద నిర్ణయం తీసుకుంటే… గ్రూప్ స్టేజిలోనే టీమ్ ఇండియా ఎలిమినేట్ అవుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీని వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం సెలెక్ట్ చేయాల్సిందేనన్నారు. వాళ్ల స్థానాన్ని భర్తీ చేసే మొనగాడు ఇప్పటివరకు లేరన్నారు. వీళ్ళిద్దరూ లేకపోవడంతో టి20 లలో చెత్త ప్రదర్శన కనబరుస్తోందని విమర్శలు చేశారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

Related News

ఐసీసీతో కుమ్మ‌క్కు..అందుకే టీమిండియాకు మూడు ట్రోఫీలు..ఫ్లాట్ పిచ్ లు రెడీ చేసి కుట్ర‌లు!

బికినీ భామ‌తో వీరేంద్ర సెహ్వాగ్..హాట్ ఫోటోలు వైర‌ల్ !

టీమిండియా ప‌త‌నం మొద‌లైంది..ఏషియ‌న్‌ గేమ్స్, 2027 వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ ఓడిస్తాం

స్పిన్న‌ర్లు అంటే ఫ్యాంట్లు త‌డుపుకుంటున్నాడు..అలాంటి తిల‌క్ వ‌ర్మ‌కు వైస్ కెప్టెన్సీ అవ‌స‌ర‌మా?

ఇంగ్లండ్ బౌల‌ర్ల దెబ్బ‌కు ఒక్కొక్క‌డికి 120 డిగ్రీల జ్వ‌రం వ‌చ్చింది!

వైభవ్ వయస్సు కంటే, ఎక్కువ రన్స్ చేయడం లేదు.. పరువు తీసిన మాజీ క్రికెటర్

Video: ఆర్చ‌ర్ బౌలింగ్ లో ఆడ‌టం చేత‌కావ‌డం లేదా? వైభ‌వ్ కు క్లాస్ పీకిన‌ గంభీర్

Big Stories

Advertisement
×