BigTV English

Team India : టీమ్ ఇండియాలో చివరి నలుగురుకి బ్యాటింగ్ రాదా?

Team India : టీమ్ ఇండియాలో చివరి నలుగురుకి బ్యాటింగ్ రాదా?

Team India : టీమ్ ఇండియాలో చివరి నలుగురికి బ్యాటింగ్ రాదనే ప్రచారాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అందువల్లే కోహ్లీ, రాహుల్ కంప్లీంట్ డిఫెన్స్ కి వెళ్లారని,  తమ తర్వాత ఆడేవాళ్లు లేరని, అందుకే ఒక ఫోర్ కూడా కొట్టడానికి ధైర్యం చేయలేదని చెబుతున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ లో వైఫల్యానికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు.


ఆ మాటే నిజమే కావచ్చు కానీ, వరుసగా మూడు వికెట్లు పడిన తర్వాత ఏ జట్టు అయినా డిఫెన్స్ మోడ్ లోనే వెళుతుందని చెబుతున్నారు. కాకపోతే అక్కడ పిచ్ మందకొడిగా ఉండటంతో వీళ్లిద్దరికి ఆడటమే కష్టమైపోయింది. గిల్ వికెట్ పడిన తర్వాత క్రిజులోకి వచ్చిన కొహ్లీ ఒక ఓవర్ లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. బ్యాట్ మీదకి బాల్ వస్తే ఆటోమేటిక్ గా ఆడతారు. అదే కోహ్లీ 15 ఓవర్ తర్వాత సింగిల్ తీయడానికి కూడా అవస్థ పడ్డాడు. ఇక రాహుల్ అయితే టెస్ట్ మ్యాచ్ ని తలపించాడు. అక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ మన వైపు లేవంతే…టాస్ ఓడిపోవడం దగ్గర నుంచి అంతా రివర్సే నడిచింది.

బౌలర్లకి బ్యాటింగ్ రాదన్న మాట మాట నిజమైనా, మరి అందరు బ్యాటర్లు ప్రతి మ్యాచ్ లో  బౌలింగ్ ఎందుకు చేయరని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏ టీమ్ తీసుకున్నా చివరి నలుగురు ఆటగాళ్లు బ్యాటర్లు కారు. ఇది అందరూ గుర్తించాలని అంటున్నారు.  వారు కేవలం బౌలర్లు మాత్రమే. అందులోనే నిష్ణాతులుగా ఉంటారు. మళ్లీ ఇందులో వేలు పెట్టి ప్రాక్టీసు చేస్తే ఆ లయ దెబ్బతింటుందని కొందరంటున్నారు. ఎవరు చేసే పని వారు చేయాలి, అందుకే బ్యాటర్లు పరుగులు చేయాలి. బౌలర్లు వికెట్లు తీయాలి అని అంటున్నారు.


ఇలాంటి కామెంట్లు చేసేవారిని విశ్వసించవద్దని చెబుతున్నారు. టీమ్ ఇండియా మాత్రమే కాదు, ఏ జట్టుకైనా ఒకటి నుంచి ఏడు వికెట్లు మాత్రం బ్యాటింగ్ చేసే విధంగా ఉంటారు. ఆ తర్వాత ఏ జట్టు పరిస్థితి అయినా అంతేనని అంటున్నారు. కోహ్లీ, రాహుల్ ఓవర్ డిఫెన్స్ ఆడటం వల్ల అందరికీ అలా అనిపించి ఉండవచ్చు. వెనక వచ్చేవాళ్లు లేక ఇలా ఆడారని, కానీ అది నిజం కాదని చెప్పుకొస్తున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×