NZ VS SA: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా ఇవాళ.. మరో కీలక మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా ల ( New Zealand vs South Africa ) మధ్య… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు రెండో సెమీ ఫైనల్ జరగనుంది. పాకిస్తాన్ లోని.. లాహోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు… దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కంటే ముందే పాకిస్తాన్ లో పెను విషాదం చోటుచేసుకుంది.
Also Read: IND VS AUS: దెబ్బకు దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేరిన టీమిండియా
పాకిస్తాన్ దేశంలో మరో బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ సంఘటనలో ఏకంగా 9 మంది మరణించగా 25 మందికి గాయాలు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవాళ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు.. ఈ బాంబు బ్లాస్ట్ జరగడం… ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మంగళవారం అర్ధరాత్రి.. ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. హఫీజ్ గుల్ బహదూర్ అనే ఉగ్రవాద సంస్థ ఈ బాంబు బ్లాస్టు చేసినట్లు ఒప్పుకుందట.
ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరుగుతున్న సమయంలోనే.. బాంబు బ్లాస్ట్ చేస్తే పాకిస్తాన్ ప్రభుత్వం డిమాండ్లకు దిగి వస్తుందని ఉగ్రవాదులు ఇలా రెండు రోజులకు ఒకసారి ప్రయత్నాలు చేస్తున్నారట. గత రెండు రోజుల కిందట పాకిస్తాన్లోని పేషావర్ లో… కూడా బాంబు బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే రెండు రోజుల తర్వాత.. మరో బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు.25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఇక గాయపడ్డ వారిని పాకిస్తాన్లోని ప్రముఖ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ బాంబు బ్లాస్ట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసింది పాకిస్తాన్ సర్కార్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పాకిస్తాన్ కు వచ్చిన విదేశీ అభిమానులను జాగ్రత్తగా చూసేందుకు చర్యలు తీసుకుంటుంది. అలాగే సెమీ ఫైనల్ మ్యాచ్.. ఇవాళ జరుగుతున్న నేపథ్యంలో స్టేడియం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తోంది పాకిస్తాన్ సర్కార్.
Also Read: Rizwan Babar Dropped: పాక్ లో ప్రకంపనలు.. జట్టు నుంచి రిజ్వాన్, బాబర్ ఔట్.. కొత్త కెప్టెన్ ప్రకటన ?
మ్యాచ్ కు ఎలాంటి అంతరాయం జరగకుండా… అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ముందే ఊహించిన టీమిండియా… హైబ్రిడ్ మోడల్ కు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో… ఈ టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ దుబాయ్ లో జరుగుతోంది. ఈ టోర్నమెంట్లో… మంగళవారం ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఫైనల్ కు చేరుకుంది టీం ఇండియా. ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ ఉంది. ఇందులో గెలిచిన జట్టుతో టీమిండియా ఫైనల్ దుబాయ్ వేదికగా ఉంటుంది.
BIG BREAKING NEWS 🚨 Terror attack in Pakistan amidst Champions Trophy match.
New Zealand and South Africa will play their semifinal in Pakistan today.
9 killed, 25 injured as 2 b*mb blasts jolt Pakistan's Khyber Pakhtunkhwa.
Hafiz Gul Bahadur (frmr Pak Army alliance) group… pic.twitter.com/jBoaIfIQSk
— Times Algebra (@TimesAlgebraIND) March 4, 2025