Gundeninda GudiGantalu Today episode march 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి ఎక్కడికి వెళ్ళిందో వెతకాలి అని మనోజ్ ని బాలుని బయటకు పంపిస్తాడు. వాళ్ళిద్దరూ రోహిణిని వెతుకుతూ ఉంటారు అయితే కేపీ పాలెం బస్సు ఎక్కిందని పార్లర్లో ఒక అమ్మాయి చెప్పడంతో అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. మీనా ఫోన్ చేస్తే మీనా కూడా రమ్మని బాలు అంటాడు. ఇక బాలు మనోజ్ని ఆట ఆడుకుంటాడు నువ్వు జాబ్ లేకుండా పార్కులో పడుకున్నావ్ ఆ పాలరమ్మ నిన్ను వదిలేసి పోయింది మధ్యలో నాకేంటి తిప్పలు. నిన్ను ఏసుకొని ట్రిప్ కి వెళ్ళినట్టు వెళ్తున్నాను అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాడు. మీనా ఫోన్ చేస్తుంది రోహిణి దొరికిందా ? ఎక్కడికెళ్ళిందో తెలిసిందని బాలుని అడుగుతుంది. మీనాని చూసుకొని ఇంకా రెచ్చిపోతాడు బాలు. ఒకవైపు బాలు నాకు ఆకలేస్తుందని ఫుడ్ ని తెచ్చుకుంటాడు. కానీ మనోజ్ మీనా మీరు కాస్త మాట్లాడడం మానేసి కారును పోనిస్తారా అని అంటారు అయినా కూడా బాలు రెచ్చిపోయి పాటలు పాడుతాడు. ఇక మనోజ్ నేను వెళ్ళిపోతాను కారు ఆపరా అని అంటాడు కానీ బాలు మాత్రం నడుచుకుంటూ వెళ్ళిపోతావా అయితే వెళ్ళు మరి నీ చేతిలో చిల్లి కవ్వ కూడా లేదు అంటూ ఎగతాళి చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా బాలు మనోజ్ కేపీ పాలెం లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంటారు. ప్రభావతి కోడలు పోయిందని బాధతో ఉంటుంది. ఇక మనోజు కార్ ఆపరా నేను వెళ్ళిపోతానని అంటాడు. ఎక్కడికి వెళ్తావు రా వెళ్ళు.. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు నువ్వు మళ్ళీ తిరిగి తిరిగి ఇక్కడికి రావాలి అది ఆలోచించు పద మీనా మనం వదిలేసి వెళ్ళిపోదాం వాడి చావు వాడు చేస్తాడు అనేసి బాలు సెటైర్లు వేస్తాడు.. ఇక మీనా ఏంటండీ ఇలాంటి టైంలో కూడా మీరు కాసేపు ఆగండి ఇక్కడ ఎవరికైనా తెలుసేమో అడుగుదాం అనేసి అంటుంది. ఇక అప్పుడే చింటూ మీనా అత్త అనేసి వస్తాడు. చింటూ నువ్వేంటి ఇక్కడ అని నేను అడుగుతుంది. మా ఊరు అత్త అంటే మీ అమ్మమ్మ ఫోన్ ఎందుకు పనిచేయలేదు అంటే మా అమ్మమ్మ ఫోను లేదు అని చింటూ అంటాడు
సరే మీ ఇంటికి ఒకసారి తీసుకెళ్ళావా మీ అమ్మమ్మ తో మాట్లాడాలి అని మీనా అడుగుతుంది. రోహిణి మాత్రం మనోజ్ చేసిన మోసాన్ని నేను ఎప్పుడూ జీర్ణించుకోలేకపోతున్నాను అమ్మ నావల్ల కావట్లేదు అన్ని కోల్పోయిన నాకు మనోజ్ వల్ల నా జీవితంలో కొత్త వెలుగు వచ్చింది మనోజ్ ని అందుకే ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను తనతో ఉంటే నా జీవితం బాగుంటుందని ఎన్నో కలలు కన్నాను కానీ ఇప్పుడు మనోజ్ నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు అని రోహిణి సుగుణమ్మతో అంటుంది.
దానికి సుగుణమ్మ నువ్వు చేసిన మోసన్ని పోలిస్తే అతను చేసింది పెద్ద మోసం కాదు భార్య దగ్గర జాబ్ లేదని తెలిస్తే చీప్ గా చూస్తుందని అనుకున్నాడు ఏమో అందుకే చెప్పలేకపోయాడు అని ఆమె అంటుంది. ఇన్ని రోజులు ఉన్న తల్లిని లేదని చెప్పి, ఏంది తండ్రిని ఉన్నాడని చెప్పుకుంటూ గొప్పలకి పోయి పెళ్లి చేసుకున్నావు అది మోసం కదా అది గనక బయటపడితే నిన్ను అల్లుడుగారు క్షమిస్తారా నీకు సపోర్ట్ చేస్తారా అనేసి సుగుణమ్మ అనగానే రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడే బయట కారు శబ్దం వినిపించి రోహిణి ఎవరొచ్చారు అని టెన్షన్ తో చూడ్డానికి వస్తుంది. బాలు మీనా మనోజ్ రావడం చూసి సుగుణమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నేను వచ్చానని వాళ్లకు తెలిసిందేంటి బాలు మనోజ్ వాళ్ళు వచ్చారు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పద్దమ్మా అసలు ఎందుకు వచ్చారో కూడా తెలియదు కదా నువ్వు కనుక్కో అనేసి లోపలికి వెళ్ళిపోతుంది.. ఇన్ని రోజులైనా అమ్మని చూడ్డానికి ఏంటమ్మా మీనా ఇలా వచ్చారు అనేసి సుగుణమ్మ అడుగుతుంది..
బాలు మనోజ్ పై సెటైర్లు వేస్తూ ఉంటాడు. మీనా మాత్రం మా తోడుకోడలు వాళ్ళ ఆయన మీద అలిగేసి బయటికి వెళ్లిపోయిందమ్మ ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము ఎవరో ఇక్కడికి వచ్చిందని చెప్తే ఇక్కడికి వచ్చాము మీకు ఏమైనా తెలిసి ఉంటది కదా అని ఇంటికి వచ్చామని నేను అంటుంది కానీ సుగుణమ్మ మాత్రం నాకు తెలియదమ్మా ఎవరు? ఒకసారి రెండుసార్లు చూశాను అంతే అంత గుర్తు కూడా లేదు అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ రోహిణి ఫోటో చూపిస్తే ఇక్కడ ఈ అమ్మాయి నేనెప్పుడూ చూడలేదు అమ్మా అని అబద్ధం చెప్తుంది.
ఇక సుగుణమ్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఊర్లో ఎవర్నో కలవడానికి వచ్చింది ఒకసారి మనం బయటికి వెళ్లి వెతుకుదాం అనేసి వాళ్ళు ముగ్గురు బయటికి వెళ్లి అందరిని అడిగి వెతుకుతారు. ఎవరైనా చూశారని చెప్పారని అడిగితే ఎవ్వరు చూడలేదని అంటున్నారు ఊరంతా వెతికాం.. ఇక పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని మనోజ్ అనుకుంటాడు. బాలు మాత్రం ముందు నాన్న దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పి ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మేలు అని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే ప్రభావతికి బాలు నన్ను సన్యాసం తీసుకొని మాట్లాడడమ్మా రోహిణి వెళ్ళిపోయింది అని బాధలో నేనుంటే నన్ను ఇంకా గుచ్చి గుచ్చి బాధ పెట్టడం మానేసి కంప్లైంట్ ఇస్తాడు.
చిరాకు లో ఉన్నాను రా నువ్వు నన్ను ఇది చేయకు నేనేం చేస్తాను నాకే తెలియదని మనోజ్ బాలుకు వార్నింగ్ ఇస్తాడు. ఇది మరీ బాగుందిరా నీకోసం నేను నా ట్రిప్పును వదిలేసుకుని డీజిల్ లేకపోతే డీజిల్ మరీ కొట్టించుకొని ఇంత చేస్తే 200 కిలోమీటర్ల నీకోసం తిరిగితే నువ్వు ఈ మాట అంటావా చూసావా మీనా ఈ డబ్బావతికి మనోజ్ ఏమని చెప్తున్నాడు అనేసి అంటాడు బాలు. ఇదంతా కాదురా 200 కిలోమీటర్లు వచ్చాను కిలోమీటర్కు 15 రూపాయలు చొప్పున నాకు 3,000 తీ డబ్బులు చూసావా మీనా ఎంత కష్టపడి వీడి కోసం వెళ్తే వీడు ఎలా అంటున్నాడు అని బాలు అంటాడు. ఇప్పుడే రోహిణి ఇక ఆపు బాలు అని అరుస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో జరుగుతుందో చూడాలి..