E-Paper
Advertisement

టీమిండియాలో అంతర్యుద్ధం…గంభీర్‌, కోహ్లీ ఇద్ద‌రూ డిష్యుం..డిష్యుం !

టీమిండియాలో అంతర్యుద్ధం…గంభీర్‌, కోహ్లీ ఇద్ద‌రూ డిష్యుం..డిష్యుం !
Advertisement

Gambhir Vs Kohli:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India) మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ (India tour of England, 2026 ) ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ చేతిలో టి20 సిరీస్ కోల్పోయిన ఇండియా… ఎలాగైనా వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలన్న కసితో బరిలోకి దిగుతోంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టులో ఉన్న గొడవలు తెరపైకి వస్తున్నాయి. విరాట్ కోహ్లీ (Virat Kohli) అలాగే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మధ్య గొడవలు జరుగుతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వ‌స్తున్నాయి. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కంటే ముందు ప్రాక్టీస్ సమయంలో ఈ ఇద్దరు ఎక్కడ మాట్లాడుకోలేదని తెలుస్తోంది. ఒకరినొకరు ఎదురుపడ్డా కూడా ఎడమొఖం పెడ ముఖం పెడుతున్నారట. దీంతో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన పాత గొడవలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

టీమిండియాలో అంతర్యుద్ధం…గంభీర్‌, కోహ్లీ ఇద్ద‌రూ డిష్యుం..డిష్యుం !

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో నాలుగు రోజుల కిందటే టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో ఉన్న టీమిండియా ప్లేయర్లు నెట్స్ లో తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. టి20 సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో.. వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించాలన్న కసితో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ అలాగే విరాట్ కోహ్లీ మధ్య ఉన్న గొడవలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఐపీఎల్ సందర్భంగా ఇద్దరు గొడవపడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత.. మాటలు కలిసాయి. మళ్లీ ఏమైందో తెలియదు కానీ…ఇంగ్లాండ్ లో గంభీర్ ఎదురుపడితే ముఖం చాటేస్తున్నాడట కోహ్లీ. అతనితో మాట్లాడడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదట.

మీడియేటర్ గా బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్

గంభీర్ ట్రై చేసిన కూడా కోహ్లీ మాత్రం పట్టించుకోనట్లే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో కోహ్లీని తప్పించాలని గంభీర్ సైలెంట్ గా కుట్ర చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న కోహ్లీ… ఇప్పుడు గంభీర్ కు టార్చర్ చూపిస్తున్నాడట. గంభీర్ తో ఏదైనా అవసరం ఉంటే టీమిండియా బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ (Sitanshu Kotak) తో చెబుతున్నాడట. ఆ బ్యాటింగ్ కోచే ఇప్పుడు ఇద్దరి మధ్య మీడియేటర్ గా పని చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో టీమ్ ఇండియా జట్టులో జరుగుతున్న అంతర్యుద్ధం బయటపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisement

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

 

Related News

మా పాకిస్తాన్ అంటేనే చుల‌క‌న‌గా చూస్తారు..షాహిద్ అఫ్రిది సీరియ‌స్

రోహిత్ కు 87 ఛాన్సులు ఇచ్చారు..మ‌రీ స్కూల్ కు వెళ్లే వైభ‌వ్ కు 3 మ్యాచ్ లే స‌రిపోతాయా?

పెళ్లి చేసుకుందే ఇద్ద‌రు ఆడాళ్లు…ఇందులో మ‌రో అమ్మాయితో ఎ**ఫైర్‌

సంజు శాంస‌న్ కు ఘోర అవ‌మానం..న‌ల్ల‌గా ఉన్నాడంటూ ?

ఆడాళ్ల‌ను చూసి నేర్చుకోండి…టీమిండియాపై సెహ్వాగ్ సీరియ‌స్‌

త‌న కంటే 5 ఏళ్లు చిన్న‌వాడైన టీమిండియా కుర్రాడితో మృణాల్ ఠాకూర్ రిలేష‌న్ ?

వింబుల్డ‌న్ లో పాకిస్తాన్ క్రికెట‌ర్లకు నో ఎంట్రీ…అయినా దొంగ‌చాటున వ‌చ్చారు క‌ద‌రా

Big Stories

Advertisement
×