Ravi Shastri On Vaibhav Suryavanshi: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వరకు టి20 సిరీస్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా చిత్తుగా ఓడిపోయి… వైట్ వాష్ అయింది. ఇక ఇవాల్టి నుంచి ఇదే రెండు జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ మేరకు టీమిండియా సన్నద్ధం అవుతోంది. ఇలాంటి క్రమంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi ) గురించి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ సూర్యవంశీకి టీమిండియాలో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం 3 మ్యాచ్ లలో అవకాశాలు ఇచ్చి… విఫలం అయ్యాడన్న కారణంతో పక్కకు పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆగ్రహించారు. రోహిత్ శర్మకు అతని కెరీర్ ప్రారంభంలో 87 మ్యాచ్ లలో అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. రోహిత్ శర్మకు 87 సార్లు అవకాశాలు ఇస్తే.. వైభవ్ సూర్యవంశీకి కేవలం మూడుసార్లు అవకాశాలు మాత్రమే ఇస్తారా ? వాడు మనిషే కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైభవ్ మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిందేనని బిసిసిఐని డిమాండ్ చేశారు.
ఇంగ్లాండ్ సిరీస్ లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ విఫలం అయిన నేపథ్యంలో అతనిపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కేవలం మూడు మ్యాచ్లలో అవకాశం ఇచ్చి… ఏకీపారేస్తున్నారు. ఐపీఎల్ లో తప్ప మనోడు అంతర్జాతీయ క్రికెట్ కు పనికిరాడంటూ హేళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీకి అండగా నిలిచారు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టి20 సిరీస్ సందర్భంగా ఏ ఒక్క టీమిండియా ఆటగాడు సరిగ్గా ఆడలేదని గుర్తు చేశారు.
అనుభవం ఉన్న శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అందరూ విఫలమైనప్పుడు… మొన్ననే స్కూల్ మానేసిన వైభవ్ ఎలా ఆడతాడని ప్రశ్నించారు. రోహిత్ శర్మకు కూడా తన కెరీర్ ప్రారంభంలో 87 సార్లు అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత రాడుదేలిన రోహిత్ శర్మ, టీమిండియా కు కెప్టెన్ గా ఎదిగి రెండు ఐసీసీ ట్రోఫీలు కూడా తెచ్చినట్లు స్పష్టం చేశారు. అలాగే వైభవ్ సూర్య వంశీకి కూడా ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని కోరారు. అప్పుడే అంతర్జాతీయ మ్యాచ్ లలో నిలదొక్కుకొని అద్భుతంగా రాణిస్తాడని అంచనా వేశారు రవి శాస్త్రి. అతని ఏజ్ తక్కువ ఉంది కాబట్టి, టీమిండియాకు 20 ఏళ్ల పాటు సేవలు అందించే ఛాన్స్ ఉంటుందని తెలిపారు.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
Ravi Shastri said, “Listen, if you are going to pick a 15-year-old boy based on an insane IPL season and throw him straight into English conditions against Jofra Archer, you have to be ready to back him through the storms. You cannot treat a generational talent like a game of… pic.twitter.com/jHF4yYccTj
— Vipin Tiwari (@Vipintiwari952) July 12, 2026