E-Paper
Advertisement

టాటా సియెర్రా EV కొనాలా? వద్దా? ముందుగా ఈ ప్లస్‌లు.. మైనస్‌లు తెలుసుకోండి!

టాటా సియెర్రా EV కొనాలా? వద్దా? ముందుగా ఈ ప్లస్‌లు.. మైనస్‌లు తెలుసుకోండి!
Advertisement

Tata Sierra EV Buying Guide: టాటా మోటార్స్ నుంచి రీసెంట్ గా మార్కెట్ లోకి విడుదలైన సియెర్రా EVపై మార్కెట్ లో సత్తా చాటుతోంది. దీని ప్రారంభ ధర రూ.18.79 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.25.99 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ SUV, టాటా కర్వ్ EV, హారియర్ EV మధ్య స్థానాన్ని దక్కించుకోగా.. మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV, మారుతి ఈ విటారా, టయోటా ఎబెల్లా లాంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలుస్తోంది. మీరు ఈ SUV కొనాలని అనుకుంటే, ముందుగా దీని బలాలు, బలహీనతలు తెలుసుకోవడం మంచిది.

కొనడానికి 3 ప్రధాన కారణాలు

1.సూపర్ ఫీచర్లు

సియెర్రా EV అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌ మెంట్ స్క్రీన్, 12.3 అంగుళాల ప్యాసింజర్ డిస్‌ ప్లే, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లేతో కూడిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉంది. అలాగే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, ICE వెర్షన్‌ లో లేని పవర్డ్ కో డ్రైవర్ సీట్, హెడ్ అప్ డిస్‌ ప్లే, ఆటో పార్క్ అసిస్ట్, సమ్మన్ మోడ్, V2L, V2V ఛార్జింగ్ లాంటి అదనపు ఫీచర్లు కూడా ఈ EVలో ఉన్నాయి.

2.విశాలమైన క్యాబిన్.. పెద్ద బూట్ స్పేస్

Advertisement

సియెర్రా EVలో విశాలమైన క్యాబిన్ ఉంటుంది. ముందు, వెనుక సీట్లలో కూర్చునే వారికి తగినంత లెగ్‌ రూమ్, హెడ్‌ రూమ్ అందుబాటులో ఉన్నాయి. వెనుక సీట్లు కూడా సౌకర్యవంతంగా ఉండటంతో లాంగ్ డ్రైవ్‌ లో అలసట తక్కువగా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో సుమారు 450 లీటర్ల బూట్ స్పేస్ తో పాటు ముందు భాగంలో ఫ్రంక్ కూడా అందించారు.

3.మంచి రేంజ్.. అంతకు మించి పనితీరు

సియెర్రా EVను 63kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లలో అందిస్తున్నారు. టాప్ వేరియంట్‌ లో ఆల్ వీల్ డ్రైవ్ కూడా ఉంది. ఈ సెగ్మెంట్‌లో AWD అందిస్తున్న అరుదైన మోడళ్లలో ఇది ఒకటి. రేంజ్ విషయానికి వస్తే, 75kWh RWD వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 665 కిలోమీటర్ల వరకు, 75kWh AWD 624 కిలోమీటర్లు, 63kWh వేరియంట్ 535 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పవర్ డెలివరీ కూడా స్మూత్‌ గా ఉండటంతో సిటీతో పాటు హైవేపైనా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

టాటా సియెర్రా ఈవీలో 2 మైనస్ లు

1.ఇంటీరియర్ క్వాలిటీ

Advertisement

ఫీచర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇంటీరియర్ నాణ్యతలో కొన్ని లోపాలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల హార్డ్ ప్లాస్టిక్ వాడటం, ప్యానెల్స్ సరిగ్గా అమరకపోవడం, కొన్ని స్టోరేజ్ స్పేస్‌లు ఉపయోగించడానికి అంత సౌకర్యంగా ఉండదు.  చిన్న చిన్న డిజైన్ లోపాలు కూడా కనిపిస్తాయి.

2.నో స్పేర్ టైర్  

సియెర్రా EVలో పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా స్పేర్ వీల్ ఇవ్వలేదు. దాని స్థానంలో కేవలం పంక్చర్ రిపేర్ కిట్ మాత్రమే అందించారు. దూర ప్రయాణాల్లో టైర్ పూర్తిగా దెబ్బతింటే ఇది కొంత అసౌకర్యంగా మారే అవకాశం ఉంది.

Read Also: ట్రయంఫ్ రాకెట్ 3కి స్టన్నింగ్ కలర్స్.. లుక్ చూస్తే అదిరిపోవాల్సిందే!

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×