Mrunal Thakur- Rishabh Pant Relationship: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ( Rishabh pant ), హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal thakur ) మధ్య రిలేషన్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తను వస్తున్నాయి. మొన్నటి వరకు తమిళ హీరో ధనుష్ తో (Dhanush) బంధం ఏర్పరచుకున్నట్లు మృణాల్ ఠాకూర్ పై అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు.. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ వెనకాల మృణాల్ ఠాకూర్ పడినట్లు చర్చ మొదలైంది. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు గురించి ఏ చిన్న వార్త వచ్చినా సోషల్ మీడియా షేక్ అవుతుంది. అయితే లేటెస్ట్ గా హీరోయిన్ మృణాల్ ఠాకూర్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పర్సనల్ లైఫ్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. రిషబ్ పంత్ అలాగే మృణాల్ ఠాకూర్ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఇద్దరూ ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో ఫాలో కూడా అయ్యారు. ఈ క్రమంలోనే వీళ్ళ సీక్రెట్ రిలేషన్ బయటకు వచ్చినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రిషబ్ పంత్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. హీరోయిన్ మృణాల్ ఠాకూర్, రిషబ్ పంత్ కంటే ముదురే. ఆమె వయస్సు 33 సంవత్సరాలు. అంటే ఇద్దరి వ్యత్యాసం ఐదు సంవత్సరాలు. సచిన్ టెండూల్కర్, అంజలి పెళ్లి చేసుకున్నట్లుగానే…హీరోయిన్ మృణాల్ ఠాకూర్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని బయట పెట్టకుండా చాలా సీక్రెట్ గా మైంటైన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేస్తారని అంటున్నారు.
రిషబ్ పంత్ గతంలో బాలీవుడ్ అందాల తార ఊర్వసి రౌతెలాతో రిలేషన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అప్పట్లో చర్చ జరిగింది. చాలా చోట్ల ఇద్దరు కలిసి తిరిగారు. కానీ ఏమైందో తెలియదు… ఇద్దరు విడిపోయారు. అటు మృణాల్ ఠాకూర్… లైఫ్ లో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ధనుష్, సిద్ధార్థతో కూడా మృణాల్ ఠాకూర్ సంబంధం పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే రిషబ్ పంత్ తో మృణాల్ మధ్య సంబంధం ఉందని చర్చ మొదలైంది.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
Mrunal thakur & Rishabh pant have started following each other on Instagram…..🤔
Mrunal is just 2nd woman Pant follows on Insta after his Sister 🥶 pic.twitter.com/00zYdGxQsw
— Harsh shekhawat (@wordofshekhawat) July 12, 2026