BigTV English

Mohammed Siraj : మనం చూస్తున్న మహ్మద్ సిరాజ్ వేరే టైప్. అక్కడ అలా.. ఇక్కడ ఇలా

Mohammed Siraj : మనం చూస్తున్న మహ్మద్ సిరాజ్ వేరే టైప్. అక్కడ అలా.. ఇక్కడ ఇలా
Mohammed Siraj

Mohammed Siraj : మహ్మద్ సిరాజ్. ఈ హైదరాబాదీ బౌలర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటోంది క్రికెట్ వరల్డ్. ముఖ్యంగా చురకత్తుల్లాంటి చూపులని. బౌలింగ్‌లో ఇంత అగ్రెసివ్ యాటిట్యూబ్ చూడలేదని క్రికెట్ కామెంటేటర్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. గ్రౌండ్‌లో అడుగుపెడితే మహ్మద్ సిరాజ్ తీరే వేరు. ముఖ్యంగా బౌలింగ్ టైమ్‌లో. విరాట్ కొహ్లీ ఎన్నోసార్లు సిరాజ్ గురించి చెప్పాడు. ఆఫ్ ఫీల్డ్, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే సిరాజ్ వేరు… గ్రౌండ్‌లోకి వచ్చాక మనం చూసే సిరాజ్ వేరు అని.


బౌలింగ్ సమయంలో సిరాజ్ కళ్లను చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఆ ముఖ కవళికలు కూడా భయపెట్టేలా ఉంటాయి. వికెట్ తీయాలన్న కసి ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. పైగా మిగతా బౌలర్లతో పోల్చలేని ఓ క్వాలిటీ సిరాజ్ దగ్గర ఉందంటాడు విరాట్ కొహ్లీ. బంతి ఎప్పుడెప్పుడు తన చేతికి ఇస్తాడా అని ఎదురుచూస్తూనే ఉంటాడని ఓ సందర్భంలో చెప్పాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు బాల్ ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు.. మహ్మద్ సిరాజ్ నుంచి వచ్చే సమాధానం “give it to me”. బౌలింగ్ విషయంలో అలసట అనేదే తెలియదు సిరాజ్‌కి. ఇలాంటి యాటిట్యూడ్ చాలా తక్కువ మందికి ఉంటుందని ప్రశంసించాడు.

మహ్మద్ సిరాజ్ బ్రదర్… మహ్మద్ ఇస్మాయిల్ కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అరబి మర్ఫా వినిపిస్తే వీధుల్లోకి వచ్చే డ్యాన్స్ చేసే సిరాజ్.. గ్రౌండ్‌లో మాత్రం చూస్తే భయపడేంత సీరియస్‌గా ఉంటాడని చెప్పుకొచ్చాడు. పొరపాటున ఎవరైన బౌండరీ కొడితే.. నెక్ట్స్ బాల్స్‌లో ఆ బ్యాటర్ రిబ్స్ టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేసే వాడని గుర్తు చేసుకున్నాడు.


మొత్తానికి, చాలా తక్కువ సమయంలోనే టీంఇండియాకు కీలకమైన బౌలర్‌గా మారాడు మహ్మద్ సిరాజ్. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లో కళ్లు చెదిరే బంతులు వేసి.. ప్రత్యర్థుల ఆట కట్టించాడు. అందుకే, ఆ తరువాత వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం బూమ్రా, ఉమేష్ యాదవ్ లేని లోటు తీరుస్తున్నాడు. 

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×