Team India: ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోహ్లీ తనదైన ఆట తీరుతో టీమిండియాకు ఎన్నోసార్లు విజయాలను అందించాడు. ఐపీఎల్ మ్యాచ్ లలో ఆర్సిబి జట్టు తరఫున ఆడి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కోహ్లీకి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ 2025లో జరిగిన మ్యాచ్లో ఆర్సిబి జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా…. కోహ్లీ తన కెరీర్ ప్రారంభంలో ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నారట. ఆమె మరి ఎవరో కాదు ఇజాబెల్లే లైట్ ( izabelle leite).
Also Read: Thaman Hitters Hyderabad: అశ్విన్ సెంచరీ…తమన్ 10 బౌండరీలతో అరాచకం.. హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ
ఈమె సినీ నటి మరియు మోడల్. ఈ అమ్మాయిని కోహ్లీ వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. చాలా కాలం పాటు సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించారు. కొద్ది రోజులపాటు ప్రేమలో కూడా మునిగితేలారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం ప్రముఖ సినీ నటి తమన్నా భాటియాతో ( Tamannaah Bhatia ) సీక్రెట్ గా రిలేషన్ పెట్టుకున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి బయట కొన్ని సందర్భాలలో కెమెరా కంట కూడా పండారు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా రకాల రూమర్స్ వచ్చాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఇక విరాట్ కోహ్లీ చివరకు బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ మొదట ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు.
ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత కోహ్లీ, అనుష్క శర్మ ( Anushka sharma) వారి వైవాహిక జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా కొనసాగించారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అనుష్క శర్మ వివాహం తర్వాత చాలా రోజులపాటు సినిమాలలో నటించారు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతోంది. కోహ్లీ మాత్రం ఇప్పటికీ క్రికెట్ రంగంలో రాణిస్తున్నాడు.
Also Read: Rohit Sharma: ఎలా ఉన్నారు ? హర్భజన్ కు తెలుగు నేర్పిస్తున్న రోహిత్.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే
కోహ్లీ, ( Virat kohli) అనుష్క శర్మ ( Anushka sharma) వారి పిల్లలతో కలిసి లండన్ లో ఉంటున్నారు. అక్కడ ఎలాంటి హంగామా లేకుండా చాలా సంతోషంగా సాదాసీదాగా జీవితాన్ని గడపచ్చని ఆలోచనతో లండన్ కి వెళ్లిపోయారు. వీరిద్దరు ప్రస్తుతం మరి పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటున్నారు. వివాహానికి ముందు కోహ్లీ ఎంతోమంది అమ్మాయిలతో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించాలని అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ వివాహం తర్వాత మాత్రం తన భార్యతో ఎంతో సంతోషంగా ఉంటున్నాడని కోహ్లీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.