BigTV English

Laddu Kiosks Machines: తిరుమల లడ్డూ కోసం ఇక నో వెయిటింగ్, సింపుల్ గా ఇలా తీసుకోవచ్చు!

Laddu Kiosks Machines: తిరుమల లడ్డూ కోసం ఇక నో వెయిటింగ్, సింపుల్ గా ఇలా తీసుకోవచ్చు!

TTD Laddus Kiosk Machines: ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో లడ్డూ ప్రసాదాన్ని ఇకపై మరింత ఈజీగా కొనుగోలు చేసేలా టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. భక్తులు కౌంటర్లలో వెయిట్ చేయకుండా ఉండేలా కియోస్క్ ల ద్వారా లడ్డూలు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. తాజాగా ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. నిజానికి అదనపు లడ్డూ ప్రసాదాన్ని పొందాలనుకునే భక్తులు, లడ్డూ విక్రయ కేంద్రాల్లో డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది.


కియోస్క్ ల ద్వారా లడ్డూలు ఎలా కొనుగోలు చేయాలి?

కియోస్క్ ల ద్వారా లడ్డూలను ఈజీగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. భక్తులు దర్శనం అనంతరం, తమ దర్శన టికెట్ నంబర్ ను కియోస్క్ లో ఎంటర్ చేయాలి. తమకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత వచ్చిన రిసీప్ట్ ను లడ్డూ కౌంటర్ లో ఇవ్వాలి. కౌంటర్ లోని వాళ్లు వెంటనే లడ్డూలను అందిస్తారు. ఒకవేళ దర్శనం టికెట్లు లేకుంటే, తమ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా 2 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు.


ఇలా చేయండి.. 

⦿ ముందుగా లడ్డూ కౌంటర్ల దగ్గర ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్ దగ్గరికి వెళ్లాలి.

⦿ దర్శనం టికెట్ ఉంటే ఓ ఆప్షన్, లేకుంటే మరో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

⦿ ఒకవేళ దర్శనం టికెట్ ఉంటే, టికెట్ వివరాలను అందులో ఎంటర్ చేయాలి.

⦿ టికెట్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి ఒక్కరికీ రెండు అదనపు లడ్డూల వరకు అనుమతిస్తుంది.

⦿  దర్శన టికెట్‌ లేనివారు ఆధార్‌ నంబర్‌ ఎంటర్ చేయాలి. ఈ ఆప్షన్ ప్రకారం ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేసుకోవచ్చు.

⦿ సరైన ఆప్షన్‌ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలి. లావాదేవీలు పూర్తి అయిన తర్వాత రసీదు వస్తుంది.

⦿ ఆ రసీదును తీసుకెళ్లి లడ్డూ కౌంటర్ లో ఇస్తే, వాళ్లు లడ్డూలు అందిస్తారు.

Read Also: వందే భారత్ లో విండో సీట్ కోసం ఇన్ని నాటకాలా? మీకు ఇలా జరిగిందా?

మున్ముందు 4 లడ్డూలకు పెంపు

ప్రస్తుతం కియోస్క్ యంత్రాల ద్వారా 2 లడ్డూలను పొందే అవకాశం ఉండగా, మున్ముందు ఆ సంఖ్య 4కు పెంచాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం లడ్డూ విక్రయ కేంద్రాల్లో 5 యంత్రాలను ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ ఎంక్వయిరీ కేంద్ర దగ్గర మరో 3 ఏర్పాటు చేశారు. మున్ముందు తిరుమల వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది.

Read Also:  ఇండియన్ బుల్లెట్ రైలుకు.. చైనా రెడ్ సిగ్నల్.. అవి ఇవ్వలేమంటూ పేచీ!

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×