BigTV English

Realme P4 5G: గేమింగ్ ప్రేమికుల కలల ఫోన్ వచ్చేస్తోంది.. దీని ఫీచర్స్ ఒక్కొక్కటి అదుర్స్..!

Realme P4 5G: గేమింగ్ ప్రేమికుల కలల ఫోన్ వచ్చేస్తోంది.. దీని ఫీచర్స్ ఒక్కొక్కటి అదుర్స్..!

Realme P4 5G: రియల్ మీ కొత్తగా తీసుకొస్తున్న P4 సిరీస్ గురించి ఇటీవల ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా మొదటి టీజర్ వెలువడింది. ఇప్పుడు కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ల హార్డ్‌వేర్ ఫీచర్లను మరింత క్లారిటీగా వెల్లడించింది. రాబోయే వారం భారత మార్కెట్‌లో ఈ సిరీస్‌ను అధికారికంగా ఆవిష్కరించబోతున్నారు. విక్రయం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్ మీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా జరగనుంది. ఇదే సందర్భంలో కంపెనీ ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది.. Ultra మోడల్‌ను ఈ సారి విడుదల చేయబోవడం లేదు. భారత మార్కెట్‌లో తమ ప్రొడక్ట్ లైనప్‌ను సింపుల్‌గా ఉంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రియల్మీ ఎగ్జిక్యూటివ్ ఒకరు సంకేతాలు ఇచ్చారు.


రియల్ మీ P4 5G.. పవర్, డిస్‌ప్లే, బ్యాటరీ
స్టాండర్డ్ రియల్ మీ P4 5G మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్ ఉంటుంది. అదనంగా, కలర్ మరియు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ కోసం ప్రత్యేకంగా Pixelworks చిప్ను కూడా జత చేశారు. ఫోన్‌లో 6.77 అంగుళాల HyperGlow AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది Full-HD+ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు కొన్ని సందర్భాల్లో 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. కంటి రక్షణ కోసం 3,840Hz PWM డిమ్మింగ్, హార్డ్‌వేర్ లెవల్ బ్లూ లైట్ ఫ్లికర్ రిడక్షన్ కూడా అందుబాటులో ఉంటాయి.

పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా బ్యాటరీ పరంగా కూడా ఈ ఫోన్ హవా చేయనుంది. 7,000mAh టైటాన్ బ్యాటరీని 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందిస్తున్నారు. రియల్ మీ ప్రకారం, ఈ ఫోన్‌తో BGMI గేమ్‌ను 11 గంటల వరకు ఆడవచ్చు. అలాగే, కేవలం 25 నిమిషాల్లో బ్యాటరీ 50% వరకు ఛార్జ్ అవుతుంది. అదనంగా రివర్స్ ఛార్జింగ్, AI స్మార్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎక్కువసేపు గేమింగ్ లేదా హెవీ యూజ్ వల్ల వేడి పెరగకుండా 7,000 sq mm AirFlow VC కూలింగ్ సిస్టమ్ కూడా అందిస్తున్నారు.


రియల్ మీ P4 Pro 5G.. ప్రీమియంలో
ప్రో మోడల్ అయిన రియల్మీ P4 Pro 5Gలో Snapdragon 7 Gen 4 చిప్‌సెట్ ఉంటుంది. దీని గ్రాఫిక్స్ కోసం ప్రత్యేకమైన HyperVision AI GPUను జోడించారు. డిజైన్ పరంగా ఇది కేవలం 7.68mm మందం మాత్రమే ఉంటుంది. బ్యాటరీ సైజు, ఛార్జింగ్ స్పీడ్ స్టాండర్డ్ మోడల్‌లాగే ఉంటాయి. 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్. గేమింగ్ ప్రియుల కోసం 90FPS వద్ద 8 గంటల పైగా BGMI ప్లే టైమ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇదే కూలింగ్ సిస్టమ్‌ను ఇక్కడ కూడా ఉపయోగించారు.

ప్రో మోడల్ డిస్‌ప్లే మరింత ప్రీమియం ఫీల్ ఇస్తుంది. HypeGlow AMOLED 4D Curve+ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్, 6,500 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కంటి రక్షణ కోసం 4,320Hz హై – ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్, TÜV Rheinland సర్టిఫికేషన్ కూడా పొందింది. కర్వ్ డిస్‌ప్లే డిజైన్ వల్ల స్క్రీన్ ఎడ్జ్‌లు మరింత స్లీక్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాయి.

Ultra మోడల్ ఎందుకు లేదు?
రియల్మీ గతంలో P సిరీస్‌లో Ultra మోడల్‌ను కూడా ఇచ్చేది. కానీ ఈసారి ఆ మోడల్‌ను స్కిప్ చేశారు. భారత మార్కెట్‌లో మోడల్స్ సంఖ్యను తగ్గించి, ఫోకస్ మోడల్స్‌పై మరింత శ్రద్ధ పెట్టాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఇది యూజర్లకు కన్ఫ్యూజన్ తగ్గించడమే కాకుండా, అందుబాటులో ఉన్న వేరియంట్లను మరింత అప్‌గ్రేడ్ చేయడానికి సహాయపడుతుంది.

Also Read: Vivo V60: మార్కెట్ లోకి కొత్త ఫోన్.. హై రేంజ్ ఫీచర్స్ తో.. ఈ మొబైల్ వెరీ స్పెషల్!

గేమింగ్, ఎంటర్టైన్‌మెంట్, బ్యాటరీ.. మూడు రంగాల్లో హవా
రియల్మీ P4 సిరీస్ రెండు మోడల్స్ కూడా గేమర్స్‌కి, ఎక్కువసేపు ఫోన్ వాడే యూజర్స్‌కి, హెవీ కంటెంట్ కన్సంప్షన్ చేసే వారికి బెస్ట్ ఆప్షన్ అవుతాయి. 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ కలయిక మార్కెట్‌లో అరుదుగా దొరుకుతుంది. అదనంగా, రివర్స్ ఛార్జింగ్ వల్ల ఇతర డివైస్‌లను కూడా చార్జ్ చేయవచ్చు.

డిస్‌ప్లే క్వాలిటీ పరంగా కూడా ఇవి టాప్-క్లాస్‌లో ఉంటాయి. HyperGlow, 4D Curve+ వంటి డిస్‌ప్లేలు కలర్ రిచ్‌నెస్, కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్‌లో హై – ఎండ్ అనుభవం ఇస్తాయి. గేమింగ్‌లో FPS స్టెబిలిటీ, కూలింగ్ టెక్నాలజీ వల్ల ఎక్కువసేపు ఆడినా లాగ్ లేకుండా అనుభవం వస్తుంది.

మార్కెట్‌లో ఎప్పుడు?
రాబోయే వారం భారత మార్కెట్‌లో రియల్మీ P4 సిరీస్ ఆవిష్కరణ జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్మీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ సేల్ మొదలవుతుంది. ధరపై ఇప్పటివరకు అధికారిక సమాచారం రాలేదు కానీ, ఈ స్పెసిఫికేషన్స్ చూస్తే, మిడ్-టు-ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వబోతుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూస్తుంటే, రాబోయే రోజుల్లో రియల్మీ P4 సిరీస్ గేమింగ్ ఫోన్లలో, లాంగ్ బ్యాటరీ లైఫ్ స్మార్ట్‌ఫోన్లలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుంది.

Related News

Moon Dust Bricks: చంద్రుడిపై ఇల్లు కట్టేందుకు ఇటుకలు సిద్ధం.. ‘మూన్ డస్ట్ బ్రిక్స్’ మెషిన్ సిద్ధం చేసిన చైనా సైంటిస్ట్

iQOO Z10 4G: 6,000mAh బ్యాటరీతో వచ్చిన కొత్త iQOO Z10 4G.. ఫీచర్లు ఏంటో చూడండి!

Smartphone market: సూపర్ షాట్ కొట్టిన స్మార్ట్ ఫోన్ ఏది? ఈ జాబితాలో మీ ఫోన్ ర్యాంక్ ఎంత?

Zoom Meeting: జూమ్ మీటింగ్‌లో టీచర్లు మాట్లాడుతుండగా… అశ్లీల వీడియోలు ప్లే చేశారు, చివరకు?

Vivo V60: మార్కెట్ లోకి కొత్త ఫోన్.. హై రేంజ్ ఫీచర్స్ తో.. ఈ మొబైల్ వెరీ స్పెషల్!

Big Stories

×