Thaman Hitters Hyderabad: క్రికెట్… ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రీడలలో ఒకటి. ఇక ముఖ్యంగా మన ఇండియాలో క్రికెట్ ఆడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. క్రికెట్ ఆడమే కాకుండా చాలామంది చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ప్రీమియర్ టోర్నమెంట్ లాంటివి చాలా హిట్ అవుతున్నాయి. ఇండియాలో జరిగిన మ్యాచ్ లతోపాటు విదేశాల్లో జరిగే మ్యాచ్లకు కూడా మన భారతీయులు ఆసక్తి చూపిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడతారు. అలాగే ప్రతి మ్యాచ్ టీవీలో వచ్చిందంటే… అతుక్కుపోతారు. మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ క్రికెట్ కి ఆసక్తి చూపిస్తారు.
Also Read: Shakshi Dhoni: ధోని కాపురంలో వాటర్ బాటిల్ చిచ్చు…సాక్షికి ఇంత పొగరా అంటూ ట్రోలింగ్ ?
సెలబ్రిటీలకు పాకిన క్రికెట్
ఇండియాలో ఏ మూలకు వెళ్లిన క్రికెట్ ఆడడమే కాకుండా చూడడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ లాంటి టోర్నమెంట్లతో పాటు సీసీఎల్ లాంటి టోర్నమెంట్లు కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవల సిసిఎల్ టోర్నమెంట్ పూర్తికాగా.. టాలీవుడ్ సెలబ్రిటీలు మరో టోర్నమెంట్ కు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సెలబ్రిటీల అందరూ తమన్ హిటార్స్ హైదరాబాద్… జట్టు తరుపున ఆడుతున్నారు. ఈ జట్టుకు… టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే.
అదరగొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీలు
తమన్ హిటర్స్ హైదరాబాద్ వర్సెస్ జట ధార వారియర్స్ మధ్య 22 అంటే నిన్నటి రోజున మ్యాచ్ జరిగింది. ఆదివారం కాబట్టి ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ హైదరాబాదులోనే జరిగింది. 20 ఓవర్ల ఈ మ్యాచ్ లో తమన్ హిట్టర్స్ హైదరాబాద్ ఏకంగా 83 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన తమని హిట్టర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో.. ఒక్క వికెట్ నష్టపోకుండా 234 పరుగులు చేసింది. వారియర్స్ బౌలర్స్ ను చితకొట్టేశారు తమన్ హిట్టర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు.
Also Read: David Lawrence: టీమిండియాతో టెస్ట్ సిరీస్… ఇంగ్లాండ్ క్రికెటర్ మృతి.. బ్లాక్ బ్యాడ్జీలతో !
అయితే ఈ నేపథ్యంలోనే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 31 బంతులలో ఏకంగా 52 పరుగులు సాధించాడు. ఇందులో 10 బౌండరీ లతో పాటు ఒక సిక్సర్ ఉంది. ఓవరాల్ గా 55 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు తమన్. ఇక మరో ఓపెనర్ హీరో అశ్విన్ బాబు… 59 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో తొమ్మిది బాగుండరీలతో పాటు నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అయితే సెంచరీ పూర్తయిన తర్వాత రిటైర్డ్ హార్డ్ అయ్యాడు అశ్విన్ బాబు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ప్రశాంత్ వర్మ 35 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్ లతో పాటు రెండు సిక్సర్లు కూడా ఉన్నాయి. అనంతరం బ్యాటింగ్ కు దిగిన వారియర్స్… నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 151 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 83 పరుగుల తేడాతో తమన్ జట్టు విజయం సాధించింది.