BigTV English

Coolie: కూలీ కు అనుకూలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కారణం అదేనా?

Coolie: కూలీ కు అనుకూలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కారణం అదేనా?

Coolie: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ రేట్లు ఎలా ఉండేవో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా తక్కువగా ఉండేవి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండే వైసీపీ ప్రభుత్వం వినోదాన్ని ప్రేక్షకుడికి దూరం చేయకూడదు. అందుకనే టిక్కెట్ రేటు ఇలానే ఉండాలి అంటూ తమ వెర్షన్ వాళ్ళు చెప్పుకొచ్చారు.


టికెట్ రేట్లు మరీ అంత తక్కువ ఉండడం కరెక్ట్ కాదు అంటూ సినిమా వాళ్లు అందరూ కలిసి అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి రేట్ల విషయమై అభ్యర్థించుకున్నారు. ఎప్పుడు పెద్ద సినిమా విడుదలైన టికెట్ రేట్లు గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఇక ఆగస్టు 14న రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రజనీకాంత్ నటించిన కూలీ, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2.

 


అనుకూలించిన ప్రభుత్వం 

సినిమా టికెట్ రేట్స్ హైక్ చేస్తున్నట్టు నిన్న వార్తలు వచ్చాయి. తరుణంలో చెన్నై కంటే హైదరాబాద్ టికెట్ రేట్లే ఎక్కువగా అనిపించాయి చాలామందికి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. చాలామంది విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనితో సినిమాకి హైక్స్ లేవు అని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కూలీ సినిమా ఆంధ్రా ప్రదేశ్ లో ఉదయం 5 గంటలకు ప్రీమియర్ షో. మల్టీ ప్లెక్స్ కి 100 రూపాయలు. సింగల్ స్క్రీన్స్ కి 75 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్స్ పెంచుకునే వెసులు బాటు కూడా కల్పించింది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకూలించటం వెనకాల పలు రకాల రీజన్స్ వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రజనీకాంత్ కి మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఇది కూడా ఒక కారణం అంటూ కొంతమంది అభిప్రాయం.

కూలి సినిమాపై లోకేష్ ట్వీట్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూలి సినిమా గురించి కూడా ఒక ట్వీట్ వేశారు. రజినీకాంత్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ ట్వీట్ వేస్తూ కూలీ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిపారు. ఇక ఈ సినిమాకి ఎన్ని అనుకూలిస్తున్న కూడా ఏ సర్టిఫికెట్ రావడంతో ఈ సినిమాకి పిల్లలను అనుమతించుము అని తేల్చి చెప్పేస్తున్నాయి కొన్ని థియేటర్ మేనేజ్మెంట్స్. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి సినిమాకి వెళ్ళాలి అనుకుంటారు. ఇప్పుడు ఇటువంటి ఆంక్షలు వలన ఇంట్లో పిల్లలను విడిచిపెట్టి సినిమాకు వెళ్లలేరు. దీనితో కలెక్షన్ల పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమాకి మంచి రెస్పాన్స్ ఉంది. రిజల్ట్ బట్టి కలెక్షన్స్ ఏ రేంజ్ అర్థమవుతుంది.

Also Read: Janhvi Kapoor : మెగాస్టార్ నే పక్కన పెట్టేసారు, బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయడంలో తప్పులేదు

Related News

Coolie : ఇది రజనీకాంత్ అసలు క్రేజ్, టికెట్లు కొని మరి సినిమాకి పంపిస్తున్నారు

Varsha Bollamma :సీనియర్ నటుడిని కాలుతో తన్నిన హీరోయిన్, అంత గొడవ ఏమి జరిగింది?

Coolie: తెలుగు రాష్ట్రాల్లో రజనీ ర్యాంపేజ్, ఇదయ్యా మీ అసలు స్టామినా

Rajinikanth: బట్టతలా? మరి నీది ఏంటి.. ఇలా బాడీ షేమ్ చేస్తున్నావ్.. నువ్వొక సూపర్ స్టార్‌‌వా?

Coolie: ప్రసాద్ ఐమాక్స్ లో పిల్లలపై ఆంక్షలు… షాకింగ్ నిర్ణయం తీసుకున్న మేనేజ్మెంట్

Big Stories

×