Jewelers robbery case: హైదరాబాద్, ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపడి దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర శివారులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాల అధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. దోపిడీ ఘటనపై నిందితులను విచారిస్తున్నారు. దుండగులు వాడిన వెపన్స్, బైక్స్ స్వాధీనం చేసుకున్నారు.
తుపాకులతో ఖజానా జ్యువెలర్స్ లోనికి దూరి అక్కడి ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే. మొత్తం పది నిమిషాల సమయంలోనే చోరీకి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఎలాగైనా దొంగలను పట్టుకోవాలని సైబరాబాద్ సీపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సీపీ పది బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు హైదరాబాద్ దాటకముందే నగర శివారు ప్రాంతంలో దొంగలను పట్టుకున్నారు. ఈ దోపిడి దొంగలను పట్టుకునేందుకు దాదాపు వెయ్యి కెమెరాలను పరిశీలించి వారు పోయిన రూట్లలో చెక్ చేశారు..
అసలు ఈ దొంగలు ఏ రాష్ట్రానికి చెందినవారు..? ఎప్పటి నుంచి హైదరాబాద్ లో నివసిస్తున్నారు..? వీళ్ల ముఠాలో మొత్తం ఎంత మంది ఉన్నారు..? ఆరుగురే వచ్చారా..? ఇంకా ఉన్నారా..? హైదరాబాద్ ఏ లాడ్జ్ లో ఉన్నారు..? సెక్యూరిటీ లూప్స్ ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.
ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో చందానగర్, ఖజానా జ్యువెల్లరీ షాపులో దోపిడి దొంగలు చొరబడిన విషయం తెలిసిందే. వారు షాపు లోపలికి చొరబడుతున్న సమయంలో అక్కడి సిబ్బంది ఎదురుతిరిగారు. వెంటనే ఆ గ్యాంగ్ కాల్పులకు దిగింది. రెండు రౌండ్లు కాల్పులు కూడా జరిపింది. ఈ తతంగమంతా షాపులోని సీసీ కెమెరాలో రికార్డు కాకుండా ఉండేందుకు వాటిని కూడా ధ్వంసం చేశారు. తొలుత షాపులోకి ఎంటరైన ఆరుగురు ముఠా, గన్‌తో బెదిరించి లాకర్ తాళాలు కావాలని సిబ్బందిని డిమాండ్ చేసింది. సిబ్బంది తాళాలు ఇవ్వకపోవడంతో కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ALSO READ: Weather News: బంగాళఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం
లోపల బంగారు ఆభరణాలకు సంబందించిన స్టాల్స్ పగలగొట్టి నగలను వారితో తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకున్నారు. వాటిలో వెండి ఆభరణాలు ఉన్నాయి. ఓ వైపు ఈ తతంగం జరుగుతుండగానే భయపడ్డారు సిబ్బంది. అప్పటికే కొందరు కస్టమర్లు షాపులో ఉన్నారు. వెంటనే వారు పోలీసుకు సమాచారం ఇచ్చారు. పోలీసు వాహనాల సౌండ్ వినిపించడంతో అక్కడి నుంచి ఆ గ్యాంగ్ పరారైంది. ఈ గ్యాంగ్‌లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నట్లు షాపు సిబ్బంది చెబుతున్నారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ సిటీలో పట్టపగలు ఇలాంటి ఘటన జరగడంతో మిగతా బంగారం షాపు యజమానులు హడలిపోతున్నారు.
ALSO READ: Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం
ఈ దోపిడీ ఘటనలో ఆరుగురి ముఠా మూడు బైకులపై మియాపూర్ నుండి చందానగర్ వైపు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్‌తో రెక్కీ నిర్వహించిన తర్వాత ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మూడు బైకులను ఖజానా జ్యువెలర్స్ సమీపంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పార్క్ చేశారు. అనంతరం ఆరుగురు కలిసి ఒకేసారి ఖజానా జ్యువెలర్స్ షాపులోకి ప్రవేశించారు. దోపిడీ తర్వాత హైదరాబాద్ దాటుతున్నట్టు పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.