T20 Records : సాధారణంగా టీ-20 క్రికెట్ లో నిత్యం ఎప్పుడూ ఏదో ఒక రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి. ఆ రికార్డులను కొద్ది రోజుల్లోనే బ్రేక్ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని రికార్డులు మాత్రం అస్సలు ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. ఇలా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇలాగే టీ-20 బ్లాస్ట్ లో లారా హారీస్ చేసిన రికార్డు మహిళా క్రికెట్ లో చారిత్రాత్మకమైనది అనే చెప్పవచ్చు. టీ-20 లీగ్ లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో ఏ క్రీడాకారిణి అయినా 300 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే మొదటిసారి. లారా హారిస్ వార్విక్ షైర్ తరపున ఆడుతుండగా.. ఆమె జట్టు ఈ టోర్నమెంట్ టైటిల్ మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ లీగ్ లో విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం ద్వారా లారా తన పేరిట కొత్త రికార్డు సృష్టించింది.
A0lso Read : Warangal Cricket Stadium : వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… స్పోర్ట్స్ స్కూల్ కి గ్రీన్ సిగ్నల్
లారా హారిస్ అద్భుతం..
లారా హారిస్ టీ20 బ్లాస్ట్‌లో అద్భుతంగా రాణించింది. ఆమె 16 మ్యాచ్‌ల్లో 320 పరుగులు చేసింది. ఆమె బ్యాటింగ్ సగటు 21.33 మాత్రమే. కానీ, ఈ క్రీడాకారిణి స్ట్రైక్ రేట్ 207.79గా ఉంది. లారా 2 హాఫ్ సెంచరీలు సాధించే క్రమంలో 16 సిక్సర్లు కొట్టింది. ఈ క్రీడాకారిణి 44 ఫోర్లు కూడా కొట్టింది. టీ20 క్రికెట్‌లో ఒక మహిళా క్రీడాకారిణి లీగ్‌లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 300 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి. టీ20 బ్లాస్ట్‌లో సుజీ బేట్స్ అత్యధిక పరుగులు చేశాడు. డర్హామ్ తరపున ఆడుతున్న ఈ సీనియర్ ప్లేయర్ 13 మ్యాచ్‌ల్లో 33.76 సగటుతో 439 పరుగులు చేసింది. టోర్నమెంట్‌లో సుజీ 2 హాఫ్ సెంచరీలు చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సుజీ మొత్తం టోర్నమెంట్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. టీ20 క్రికెట్‌లో ఒక బ్యాటర్ అత్యధిక పరుగులు సాధించి ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం చాలా అరుదు. ఛాంపియన్ జట్టు సర్రే తరపున డానీ వ్యాట్ అత్యధిక పరుగులు చేసింది. ఆమె 9 మ్యాచ్‌ల్లో 53 కంటే ఎక్కువ సగటుతో 377 పరుగులు చేసింది. ఈ టోర్నమెంట్‌లో ఏకైక సెంచరీ ఎల్లా మాకాన్ నుంచి వచ్చింది. హాంప్‌షైర్ తరపున ఆడుతున్న ఈ ప్లేయర్ 5 మ్యాచ్‌ల్లో 81.75 సగటుతో 327 పరుగులు చేసింది.
క్రికెట్ పలు రికార్డులు
ఉమెన్స్ క్రికెట్ తో పాటు పురుషుల క్రికెట్ లో పలు రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి. సిక్సులు, ఫోర్లు, వికెట్లు ఇలా ఏ ఆటగాడు అయినా రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా టీమిండియా తరపున బౌలింగ్ లో బుమ్రా.. బ్యాటింగ్ పరంగా సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీల్లో బ్యాటింగ్ చేసి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటాడు. వీరికి తోడు శుబ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు కూడా తమదైన శైలిలో పలు రికార్డులు నెలకొల్పుతుంటారు. రిషబ్ పంత్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ క్రికెట్ లో అయినా అతను ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటాడు. ఇలా నిత్యం క్రికెట్ లో పలు వార్తలు వైరల్ అవుతుంటాయి.