BigTV English

SA vs USA T20 WC 2024 Match Preview: అమెరికా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య.. నేడే సూపర్ 8 తొలిమ్యాచ్

SA vs USA T20 WC 2024 Match Preview: అమెరికా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య.. నేడే సూపర్ 8 తొలిమ్యాచ్
South Africa vs USA T20 World Cup 2024 Super 8 Match Dream11 Prediction:  టీ 20 ప్రపంచకప్ లో మొదటి అంకంలో భాగంగా లీగ్ దశ ముగిసింది. ఇక రెండో అంకంలో అడుగుపెట్టింది. సూపర్ 8 లో భాగంగా తొలిమ్యాచ్ నేడు (జూన్ 19) దక్షిణాఫ్రికా వర్సెస్ అమెరికా మధ్య ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. ట్రాక్ రికార్డ్ పరంగా చూస్తే దక్షిణాఫ్రికా ఫేవరెట్ గా కనిపిస్తున్నా, అమెరికా దూకుడుని చూస్తే.. తేలికగా అంచనా వేయడానికి లేదని అంటున్నారు.

ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ లీగ్ దశలో దక్షిణాఫ్రికా పెర్ ఫార్మెన్స్ అంత  ఆశాజనకంగా లేదు. ఏదో చిన్నజట్ల మీద చచ్చీ చెడి గెలిచి సూపర్ 8కి చేరింది. పసికూన నేపాల్ పై ఒక పరుగు తేడాతో అతికష్టమ్మీద గెలిచింది. జట్టలో మొదటి నుంచి చూస్తే క్లాసిన్, మిల్లర్, స్టబ్స్, డికాక్ లాంటి హార్డ్ హిట్టర్ల ఉన్నారు. అయినా సరే, వెస్టిండీస్ లాంటి కఠినమైన పిచ్ లపై ఒక్కసారి 120 పరుగులు దాటలేదు. కాకపోతే నోకియా, బార్ట్ మన్, రబడ, యాన్సెన్ లాంటి సూపర్ ఫామ్ లో ఉన్న బౌలర్ల కారణంగా తక్కువ స్కోరు అయినా, దక్షిణాఫ్రికా బతికి బట్టకట్టింది.


ఇక అమెరికా నుంచి చూస్తే లీగ్ దశలో పాకిస్తాన్ ని మట్టి కరిపించింది. ఇండియాని వణికించింది. కెనడా పై సాధికారికంగా గెలిచింది. అంతేకాదు జట్టులో ఐదుగురికి మించి ప్రవాస భారతీయులు ఉన్నారు. అంటే అమెరికా జట్టు కూడా మినీ ఇండియా జట్టులాగే ఉంది. అంటే అమెరికాతో ఆడుతున్నట్టుగా లేదు.. ఇండియాతో ఆడుతున్నట్టుగానే ఉందని అందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ 8లో తొలిమ్యాచ్ దక్షిణాఫ్రికాకి సవాల్ గానే మారనుంది.

Also Read: కివీస్ కెప్టెన్ కేన్ మామ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు


ఇదే సమయంలో  పాకిస్తాన్ ను ఎలా ఓడించి, సూపర్ 8కి చేరిందో, అలాగే సౌతాఫ్రికాను ఓడించి ముందడుగు వేయాలని చూస్తోంది. బ్యాటర్లు ఆరోన్ జోన్స్, గౌస్, గజానంద్ సింగ్, నితీష్ కుమార్, శయన్ జహంగీర్ ఉన్నారు. అలాగే బౌలింగులో నేత్రావల్కర్, కెంజిగే, హర్మీత్ సింగ్ ఉన్నారు. వీరందరూ సమష్టి క్రషితో మ్యాచ్ లను గెలిపిస్తున్నారు. ఫీల్డింగ్ అత్యద్భుతంగా ఉంది. అందువల్ల ఒత్తిడి లేకుండా ఆడటం…అమెరికా బలం అని చెప్పాలి.

Tags

Related News

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Mahika Sharma: 13 ఏళ్లలోనే షాహిద్ ఆఫ్రీదితో ఎ**ఫైర్‌.. బ‌య‌ట‌ప‌డ్డ‌ పాండ్యా కొత్త ల‌వ‌ర్ భాగోతం !

INDW vs AUSW: ఇవాళ ఆసీస్ తో బిగ్ ఫైట్‌..ఓడితే టీమిండియా ఇంటికేనా? పాయింట్ల ప‌ట్టిక ఇదే

Sai Sudharsan Catch: సాయి సుద‌ర్శ‌న్ స‌న్నింగ్ క్యాచ్‌..చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..కానీ చివ‌ర‌కు

Roman Reigns vs Bronson reed: క్రికెట్ బ్యాట్ ప‌ట్టి చిత‌క‌బాదిన రోమన్ రీన్స్..బ‌లంగా బాదేసి మ‌రీ, కానీ చివ‌ర‌కు

Sa vs Nam: టీ20 చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం…దక్షిణాఫ్రికాపై నమీబియా సంచలన విజయం

AFG vs PAK: పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన అప్ఘానిస్తాన్…ద్వైపాక్షిక సిరీస్ లు ర‌ద్దు…షేక్ హ్యాండ్ లు కూడా ర‌ద్దు !

IND VS WI: 518-5 వ‌ద్ద‌ టీమిండియా డిక్లేర్డ్…గిల్ భయంక‌ర సెంచ‌రీ, WTCలో చ‌రిత్ర‌

Big Stories

×