Teacher Got Emotional: సోషల్ మీడియా హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో ఎవరు చూసినా సర్ ప్రైజింగ్ వీడియోలు, సాహసాలు చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు. అందులోను ఒకప్పుడు స్కూల్స్‌లో, కాలేజీలలో ఫోన్స్ అస్సలు తీసుకురానిచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు ఏకంగా స్కూల్స్‌లోనే వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. తాజాగా కొంతమంది విద్యార్థులు తమకు ఇష్టమైన టీచర్‌కు షాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
స్కూల్స్‌లో విద్యార్థులకు టీచర్లపై కోపంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది. టీచర్స్ తమ పట్ల ఉండే తీరుకు విద్యార్థులు చాలా అభిమానం చూపిస్తుంటారు. ఈ తరుణంలో వారికి సంబంధించిన ఓ స్పెషల్ డేస్ లేక ఏదో ఒక రోజున వారికి తోచిన బహుమతులు ఇచ్చి ఆనంద పరుస్తుంటారు. ఇలాంటి తరహాలోని వీడియోలో ఇటీవల చాలా వైరల్ అవుతున్నాయి. ఇష్టమైన టీచర్లకు క్లాస్ అంతా కలిసి బర్త్ డే, వెడ్డింగ్ డేలకు సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా తమకు ఇష్టమైన ఓ టీచర్ కి క్లాస్ లోని విద్యార్థినులు ఇచ్చిన సర్ ప్రైజ్ వీడియో వైరల్ అవుతోంది. ముందుగానే తమ ఇష్టమైన టీచర్ కోసం ఓ ఫోటో ఫ్రేం చేయించారు. దీనిని బహుమతిగా ఇచ్చేందుకు టీచర్ ను క్లాస్ రూంకి ఇన్వైట్ చేశారు. టీచర్ రూంలోకి ఎంటర్ అయ్యేదానిని వీడియో కూడా తీయడం ప్రారంభించారు. ఒక్కసారిగా ఇదంతా చూసినా టీచర్ ముందుగా సిగ్గు పడింది. అనంతరం లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంది. ఇక విద్యార్థినులు తాము తెచ్చిన గిప్ట్ ఇచ్చి టీచర్ ను సర్ ప్రైజ్ చేయగా, టీచర్ ఎమోషనల్ అయింది. దీంతో టీచర్ ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
हमारे स्कूल या कॉलेज में एक ऐसी टीचर जरूरत होती है जो सबकी फेवरेट होती है।🥰🤩 pic.twitter.com/beAtxjl6Hk
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) June 17, 2024