BigTV English

Travis Head : ఆ తాగుడు ఏంటి.. అ బొర్ర ఏంటి..మాల్దీవ్స్ లో హెడ్ రెడ్డి అరాచకం

Travis Head : ఆ తాగుడు ఏంటి.. అ బొర్ర ఏంటి..మాల్దీవ్స్ లో హెడ్ రెడ్డి అరాచకం

Travis Head : సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ సీజన్ లో కాస్త పర్పామెన్స్ కనబరుస్తలేడనే చెప్పాలి. గత సీజన్ లో హెడ్, అభిషేక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి హైదరాబాద్ జట్టును ఫైనల్స్ వరకు చేర్చారు. కానీ ఈ సీజన్ లో వీరు ఆఢితేనే హైదరాబాద్ మ్యాచ్ గెలుస్తోంది. ఎవరో ఒకరూ భారీ స్కోర్ చేస్తేనే హైదరాబాద్ విజయం సాధిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడి విజయతీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్ లో అభిషేక్ శర్మ డకౌట్ కావడం గమనార్హం. హెడ్ కాస్త పర్వాలేదనిపించాడు. ఇక ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆప్స్ కి వెళ్లాలంటే మాత్రం ప్రతీ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.


Also Read :  Riyan Parag: రియాన్ పరాగ్ బలుపు.. సొంత బౌలర్ నే బండ బూతులు తిడుతున్నాడు

చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంతో వారం రోజులు సెలవులు ఉండటంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా 2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్లు  ఐదుసార్లు ఛాంపియన్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్‌ పై సమగ్ర విజయాన్ని నమోదు చేసిన తర్వాత మిడ్-సీజన్ విరామం కోసం వెల్లారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ఒక జట్టులో ఉండగా.. వర్ధమాన సూపర్ స్టార్ అభిషేక్ శర్మ నెట్‌కు అవతలి వైపు ఉన్నాడు.  ఇండియాకి తిరిగి రాకముందు  ఈ ఆటగాళ్ల బృందం తమ ప్రతిభను ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది.వీరితో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా కనిపిస్తున్నాడు. మిగిలిన ఆటగాళ్ళు అంతా వాలీబాల్ కోర్టులో షాట్లు కొట్టగా..హెడ్ ‘సాధారణ’ ఆస్ట్రేలియన్ శైలిలో, ఒక చేతిలో మద్యం  పట్టుకుని చిల్ అయ్యేందుకే ప్రాధాన్యతనిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మద్యం సేవిస్తున్నట్టు కనిపించగా.. సోషల్ మీడియాలో ఈ తాగుడు ఏంటి..? ఆ బొర్ర ఏంటి..? కామెంట్స్ వస్తున్నాయి. ఇక మే 2, 2025న నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు ముందు SRH జట్టు వారం రోజుల విరామం తీసుకోవడంతో సెలవుల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడింది. అందులో కేవలం మూడు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్ లో 10వ స్థానంలో కొనసాగుతోంది. టాప్ ప్లేస్ లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో జరగాల్సిన 5 మ్యాచ్ ల్లో ప్రతీ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆప్స్ కి చేరుకుంటుంది. లేదంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఇంటి బాట పట్టే అవకాశం ఉంది. మరీ హైదరాబాద్ ప్రతీ మ్యాచ్ గెలుస్తుందో.. లేక ఓటమి పాలై ఇంటి బాట పడుతుందో వేచి చూడాలి మరీ.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×