Aamir Khan: బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న ఖాన్స్ అంతా ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చినవారే. వాళ్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాతే బాలీవుడ్‌లో చాలా మార్పులు వచ్చాయి. దాదాపు అయిదు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఈ ఖాన్స్ అంతా స్టార్ హీరోలుగానే వెలిగిపోతున్నారు. అలాంటి వారిలో అమీర్ ఖాన్ (Aamir Khan) ఒకరు. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న అమీర్.. కొత్తగా ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో తన కెరీర్‌కు సంబంధించిన అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. తాజాగా తన కెరీర్ మొదట్లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి గుర్తుచేసుకున్నారు అమీర్.
బ్యాక్‌గ్రౌండ్ యాక్టర్‌గా
తన కెరీర్ మొదట్లో తనకు ఎదురైన చేదు అనుభవం, అవమానం వల్లే ఈరోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని నమ్ముతానని చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. సినిమాల్లోకి రాకముందు నాటకాలతో తన కెరీర్‌ను ముందుకు నడిపించాడు ఈ స్టార్ హీరో. అలా ఒక నాటకంలో అసలు డైలాగ్‌లు లేకుండా నిలబడడం వల్ల తనకు మొదటి సినిమా అవకాశం లభించిందని గుర్తుచేసుకున్నాడు. అసలు అదెలా జరిగిందో చూసేయండి అంటూ తన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక వీడియో అప్లోడ్ అయ్యింది. గుజరాతీ భాషలోని ‘పాసియో రంగరో’ అనే నాటకంలో బ్యాక్‌గ్రౌండ్ యాక్టర్స్‌లో ఒకడిగా కనిపించాడట అమీర్. తనకు అందులో డైలాగులు లేవు, కనీసం కదలాల్సిన అవసరం కూడా లేదు.
చాలా బాధపడ్డాను
ఆ నాటకంలో ఉన్న అందరు బ్యాక్‌గ్రౌండ్ యాక్టర్స్‌లో అమీర్‌కు మాత్రమే ఒక్క చిన్న డైలాగ్ ఉందట. అది కూడా కోరస్‌లో కలిసిపోతుంది. అప్పటివరకు అమీర్‌కు కనీసం ఆ కోరస్ కూడా చెప్పే ఛాన్స్ రాలేదట. ఇంటర్ కాలేజ్ పోటీ సమయంలో మహారాష్ట్రలో జరుగుతున్న వివాదాల వల్ల తనను ఒక నాటకం నుండి తొలగించారట. దానివల్ల తను చాలా బాధపడ్డాడట. ప్రతీ నాటకానికి ముందు, తర్వాత తను ఎంతో కష్టపడినా కూడా ప్రొడక్షన్ వాళ్లు దానిని గుర్తించకుండా తనను తొలగించడమేంటి అని కృంగిపోయాడట. అదే సమయంలో తన ఫ్రెండ్.. మరొక ఫ్రెండ్‌ను పరిచయం చేశాడట. అతడు ఒక డిప్లొమా సినిమా చేయాలనుకుంటున్నాడని, యాక్టర్ కావాలని చెప్పాడట.
Also Read: అయిదేళ్ల క్రితం నమోదయిన కేసు.. ఎట్టకేలకు సీనియర్ నటికి ఊరట
అదే మొదటి అవకాశం
అలా తన ఫ్రెండ్ పరిచయం చేసిన వ్యక్తితో డిప్లొమా ఫిల్మ్ చేశాడట అమీర్ ఖాన్. దానివల్ల తనకు మంచి గుర్తింపు రావడం వల్ల అలా మరో డిప్లొమా ఫిల్మ్ చేశాడట. ‘‘ఆ డిప్లొమా ఫిల్మ్ చూసిన తర్వాతే కెటాన్ మెహ్తా నన్ను హోలీ సినిమాలో తీసుకున్నారు. ఆ సినిమా చూసిన తర్వాత దాని మేకర్స్ అంతా నేను యాక్టర్ అయిపోయానని డిసైడ్ అయిపోయారు. ఒకవేళ ఆరోజుల్లో మహారాష్ట్ర వివాదం జరగకపోయింటే నేను ఈరోజు యాక్టర్‌గా ఇక్కడ కూర్చొని ఉండేవాడిని కాదేమో. మనం సరైన సమయంలో సరైన సందర్భంలో ఉంటే అన్నీ సరిగ్గానే జరుగుతాయి’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు అమీర్ ఖాన్.