Riyan Parag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సోమవారం రోజున రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది రాజస్థాన్ రాయల్స్. నిన్నటి మ్యాచ్లో రాజస్థాన్ కొత్త ప్లేయర్.. వైభవ్ సూర్య వంశీ అదరగొట్టాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేసి… దుమ్ము లేపాడు సూర్య వంశీ. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. 24 గంటలు గడిచిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Also Read: Vaibhav Suryavanshi: 6 ఏళ్ళలోనే మొదలెట్టాడు.. 14 ఏళ్లకు చరిత్ర సృష్టించాడు
సొంత జట్టు ప్లేయర్ పై రియాన్ పరాగ్ అక్రోషం
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా… కెప్టెన్ గా కొనసాగుతున్న రియాన్ పరాగ్ ఓవర్ యాక్టింగ్ చేశాడు. తనకున్న బలుపు ను మరోసారి బయట పెట్టుకున్నాడు రియాన్ పరాగ్. రాజస్థాన్ జట్టుకు సంబంధించిన కొత్త ఆటగాడు తుషార్ దేశ్ పాండే ను బండ బూతులు తిడుతూ రియాన్ పరాగ్ (Riyan Parag) కనిపించాడు. బౌలింగ్ కోచ్ జేమ్స్ బాండ్.. ఆధ్వర్యంలోనే… వేలు పెట్టి మరి…. తుషార్ దేశ్ పాండేను బెదిరించాడు రియాన్ పరాగ్. వాస్తవానికి.. నిన్నటి మ్యాచ్లో దేశ్ పాండే అస్సలు ఆడలేదు. ఏమైందో తెలియదు కానీ.. మ్యాచ్ జరుగుతున్న మధ్యలోనే… బండ బూతులు తిట్టేశాడు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియాన్ పరాగ్ ఓవరాక్షన్ చేస్తున్నాడని… ఈ బలుపు తగ్గించుకోవాలని హెచ్చరిస్తున్నారు క్రికెట్ అభిమానులు. యంగ్ ప్లేయర్ గా వచ్చి జట్టులో స్థానం సంపాదించుకోవాలి కానీ… ఇలా రెచ్చిపోయి మాట్లాడకూడదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాగే రియాన్ పరాగ్… తన బలుపు చూపిస్తే… కేవలం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడుకోవాల్సి వస్తుందని.. సెటైర్లు పెంచుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇలా కొత్త ప్లేయర్లపై ఓవరాక్షన్.. చేస్తే భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా యాక్షన్ తీసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. అన్ని చూస్తున్న బీసీసీఐ ఎప్పుడో రియాన్ పరాగ్.. బలుపు దించుతుందని కూడా చెబుతున్నారు.
గతంలో కూడా రియాన్ పరాగ్ వివాదాలు
ఐపీఎల్ 2025 సీజన్ సందర్భంగా.. సంజు గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో రాజస్థాన్ కెప్టెన్ గా రియాన్ పరాగ్ కు అవకాశం వస్తుంది. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అనవసర వివాదాలకు వెళ్తున్నాడు. మొన్నటికి మొన్న మ్యాచ్ అనంతరం గ్రౌండ్ స్టాఫ్ సెల్ఫీ అడిగితే… వాళ్ల ఫోన్ తీసుకొని ఫోటో దిగిన తర్వాత వాళ్ళ మొఖాన పడేశాడు. ఆ వీడియో కూడా వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు ఏకంగా బౌలర్ కే వార్నింగ్ ఇచ్చాడు.
Also Read: Vaibhav Suryavanshi : మటన్, పిజ్జా విపరీతంగా తింటాడా… అందుకే సెంచరీ బాదేశాడా..వైభవ్ హెల్త్ డైట్ ఇదే
Riyan Parag Fight with Tushar deshpande in Live match #gtvsrr #riyanparag #ipl2025 pic.twitter.com/GSBqiv5mwT
— Shiva Shukla (@ShivamS89577455) April 28, 2025