BigTV English

India’s Hopes: దుమ్మురేపుతున్న కుర్రాళ్లు.. ప్రత్యర్థులకు చుక్కలే..

India’s Hopes: దుమ్మురేపుతున్న కుర్రాళ్లు.. ప్రత్యర్థులకు చుక్కలే..

India’s Hopes: భారత క్రికెట్ భవిష్యత్తుకు… ఇద్దరు కుర్ర ఫాస్ట్ బౌలర్లు ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. వాళ్లే ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్. ఈ ఇద్దరూ బౌలింగ్ మొదలెడితే ప్రత్యర్థులు వణికిపోవడం ఖాయం. అలా ఉంటోంది… ఉమ్రాన్, సిరాజ్ బౌలింగ్. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా బంతులు విసిరిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్ అక్తర్ తర్వాత… మళ్లీ అంత స్పీడుతో బౌలింగ్ చేస్తోంది ఉమ్రాన్ మాత్రమే. సిరాజ్ కూడా వేగానికి తోడు లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేస్తూ.. ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో… సిరాజ్ 2 వికెట్లు తీస్తే, ఉమ్రాన్ 3 వికెట్లు తీశాడు. గత కొన్నాళ్లుగా బుమ్రా లేని లోటుతో ఇబ్బందులు పడుతున్న భారత క్రికెట్ జట్టులో… వీళ్లిద్దరే ఇప్పుడు కీలక బౌలర్లుగా మారారు.


లంకతో జరిగిన తొలి వన్డేలో కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా… తన రికార్డును తానే అధిగమించాడు. 14వ ఓవర్లో నాలుగో బంతిని ఏకంగా 156 కిలోమీటర్ల వేగంతో విసిరాడు… ఉమ్రాన్. భారత క్రికెట్ జట్టులో చోటు దక్కినప్పటి నుంచి 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తున్న ఉమ్రాన్‌… లంకతో జరిగిన టీ-20లో 155 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి… రికార్డు సృష్టించాడు. తాజా వన్డేలో దాన్ని బద్దలు కొట్టాడు. అయితే ఉమ్రాన్ అత్యంత వేగంగా బంతిని వేసింది మాత్రం ఐపీఎల్‌లో. 157 కిలోమీటర్ల వేగంతో ఐపీఎల్‌లో బంతి వేశాడు… ఉమ్రాన్‌. అతని దూకుడు చూస్తుంటే… 160 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతిని విసిరిన షోయబ్ అక్తర్ రికార్డు బద్దలు కొట్టి, ప్రపంచంలోనే అత్యంత వేగంతో బౌలింగ్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించడం ఖాయమంటున్నారు… ఫ్యాన్స్.

ఇక మహ్మద్ సిరాజ్ కూడా తానేం తక్కువ కాదంటూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో సంచలన బంతి విసిరి… కుశాల్‌ మెండిస్‌ను ఔట్ చేశాడు. సిరాజ్‌ వేసిన బంతిని కవర్‌ దిశగా కొట్టబోయిన కుశాల్… అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. బంతి ఇన్‌స్వింగ్‌ అయ్యి వికెట్లను పడగొట్టగానే… ఒక్కసారిగా మెండిస్‌ కూడా బిత్తరపోయాడు. ఆ అద్భుత బంతిని బీసీసీఐ ట్విట్టర్‌లో షేర్‌ చేయగా… అది వైరల్‌గా మారింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×