BigTV English

Vinesh Phogat: వినేశ్ కి ఎవరూ డబ్బులివ్వలేదు: భర్త సోమ్ వీర్

Vinesh Phogat: వినేశ్ కి ఎవరూ డబ్బులివ్వలేదు: భర్త సోమ్ వీర్

Vinesh Phogat’s husband Somvir comments(Sports news today): పారిస్ ఒలింపిక్స్ లో పతకం చేజారిపోయినందుకు ఇప్పటికి మేం ఎంతో ఆవేదనలో ఉన్నాం. ఇలాంటి సమయంలో మమ్మల్ని బాధపెట్టే ప్రకటనలు ఆపాలని నెటిజన్లను వినేశ్ ఫోగట్ భర్త సోమ్ వీర్ రాథీ అభ్యర్థించారు. వినేశ్ ఇండియాలో దిగిన దగ్గర నుంచి ప్రజలు మాపై చూపిస్తున్న ఆదారాభిమానాలు చూసి బాధను మరిచిపోతున్న వేళ, ఇలా కోట్ల రూపాయలు క్యాష్ ప్రైజ్ లు వినేశ్ కి వచ్చాయని అనడం నిజంగా దురద్రష్టమని అన్నారు.


వినేశ్ ఫోగట్ కి ఎవరూ ధన సహాయం చేయలేదు. రూ.16 కోట్లు అందినట్టు వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదు. ఆర్గనైజేషన్లు, బిజినెస్ మేన్లు, ఇతర కార్పొరేట్ సంస్థలు, ఇంక ఏ ఇతర పార్టీల నుంచి తనకు డబ్బులు రాలేదని అన్నారు.  శ్రేయోభిలాషులెవరూ ఇలాంటి తప్పుడు వార్తలను, ప్రచారాలను నమ్మవద్దని అన్నారు.

ఇది కేవలం మమ్మల్ని వ్యక్తిగతంగా బాధించడమే కాకుండా, సమాజానికి మంచిది కాదని అన్నారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేసేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సోమ్ వీర్ ఒక పోస్ట్ లో తెలిపారు.


Also Read: బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారిన.. మహిళా టీ 20 ప్రపంచ కప్

అయితే వినేశ్ ఫోగట్ ఇండియాకి వచ్చిన తర్వాత సరాసరి హర్యాణాలోని తన స్వగ్రామం బలాలీకి చేరుకుంది. అక్కడ గ్రామస్తులు ఘన సన్మానం చేసి లడ్డూలు బహుకరించారు. తర్వాత గ్రామస్తులంతా చందాలు వేసుకుని రూ.21 వేలు నగదు సహాయం చేశారు. అంతే అక్కడ జరిగింది. అది చూసి చాలా సంస్థలు వినేశ్ ఫోగట్ కి క్యాష్ ప్రైజ్ లు ఇచ్చాయనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే వినేశ్ భర్త స్పందించారు.

విశ్వ క్రీడల్లో పాల్గొన్న చాలామంది ఓటమి భారంతో వెనుతిరిగారు. వారందరూ ఎక్కడ ఉన్నారో తెలీదు. గెలిచిన వారికి ప్రభుత్వం తరఫున ఎంత వచ్చిందనేది తెలీదు. అలాగే ఈసారి కార్పొరేట్ సంస్థలు కూడా పెద్దగా స్పందించలేదు. లేదంటే అవి బయటకు రాలేదో తెలీదు కానీ…క్రికెట్ తప్ప ఇతర ఆటలకి మన దేశం నుంచి అందుతున్నది శూన్యమనే అంటున్నారు. ఇది నిజంగా బాధాకరమని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇలాగైతే ఎప్పటికి ఒలింపిక్స్ లో మనకు పతకాలు రావని అంటున్నారు.

Related News

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Big Stories

×