BigTV English

Lovers in Cricket Stadium : ఇంకెక్కడా.. ఆ ప్రేమజంటకు చోటే దొరకలేదా?

Lovers in Cricket Stadium : ఇంకెక్కడా.. ఆ ప్రేమజంటకు చోటే దొరకలేదా?
Lovers in Cricket Stadium

Lovers in Cricket Stadium : ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్ట్ లో ఎవరూ చూడకూడని  ఘటన ఒకటి చోటు చేసుకుంది. అయితే ఎవరు చూడకూడదో వారి కంటిలోనే వారు పడ్డారు. ఇంతకీ ఎవరు వారంటే ఒక ప్రేమ జంట టెస్ట్ మ్యాచ్ చూడటానికి వచ్చింది. గ్యాలరీలో కూర్చుని చక్కగా మ్యాచ్ చూస్తోంది. జనం పలచగా ఉండటంతో వారికి ప్రైవసీ కలిసి వచ్చింది. ఒక సమయంలో ఇద్దరూ ఆగలేకపోయారు. అంతే పబ్లిక్ గానే రొమాన్స్ మొదలుపెట్టేశారు.


వారి పనిలో వారు బిజీగా ఉండటం వల్లే చుట్టూ ప్రపంచాన్ని మరిచిపోయారు. మ్యాచ్ లైవ్ రికార్డింగ్ చేస్తున్న కెమెరామేన్ ఒకసారి గ్రౌండ్ మొత్తాన్ని కవర్ చేస్తూ వెళుతున్నాడు. ఆ కెమెరా కంటిలో వీరు పడ్డారు. అంతే ఆ కెమెరామెన్ కి ఏం జరుగుతుందని జూమ్ చేశాడు. క్యూరియాసిటీ పెరిగిపోయింది. మరింత జూమ్ చేశాడు. అంతే పబ్లిగ్గా ఆ ప్రేమజంట వ్యవహారం మొత్తం ప్రపంచం చూసేసింది. వారి పరిస్థిని చూసి ప్రేక్షకులు నవ్వుకున్నారు. ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ ఆ ప్రేమ జంటకు మద్దతు తెలిపారు.

విషయం తెలిసిన ప్రేమజంట సిగ్గుతో బిక్క చచ్చిపోయింది.  ముఖం కనిపించకుండా ప్రేమికుడు టవల్ ని అడ్డు పెట్టుకున్నాడు. ప్రేయసి కూడా తన జుత్తుని ముఖం మీద వేసుకుని వెనక్కి తిప్పేసింది. వీరు అవస్థలు పడే కొద్దీ కెమెరా మెన్ రెచ్చిపోయాడు. కనీసం సానుభూతి కూడా చూపించకుండా ఇదే ట్రెండింగ్ అనుకున్నాడో ఏమో, మ్యాచ్ లైవ్ ఆపేసి, ఈ లైవ్ మొదలెట్టాడు.  అనంతరం ఆమె మెల్లిగా లేచి అక్కడ నుంచి పక్కకు జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.


వ్యవహారం హద్దులు మీరడంతో చాలామంది అనేమాట ఏమిటంటే, యువత కొంచెం సంయమనం పాటించాలని అంటున్నారు. లేదంటే జంతువులకి, మనుషులకి తేడా ఏముంటుందని కామెంట్ చేస్తున్నారు. మనం మనుషులం చుట్టూ సమాజం ఉంటుంది. ప్రేమికులు ఇద్దరికి కుటుంబాలు ఉంటాయి. వారికి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అన్నింటిని కొంచెమైనా ఆలోచించాలని కోరుతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×