E-Paper
Advertisement

Graduate MLC by Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ ఫిక్స్

Graduate MLC by Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ ఫిక్స్
Advertisement
political news in telangana

Graduate MLC by Election(Political news in telangana):

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ ఫిక్స్ చేసింది. జనగాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉపఎన్నిక నిర్వహణపై ఈసీ దృష్టి సారించింది. ఇందుకోసం అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు షెడ్యూల్ రూపొందించింది.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఈసీ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం.. పట్టభద్రుల కేటగిరీలో కొత్త ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ ఏడాది నవంబర్ 1వ తేదీని కటాఫ్ డేట్ గా నిర్ణయించింది. అలాగే వచ్చే ఏడాది జూన్ 8వ తేదీకల్లా జనగాం లో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉన్నట్లు శుక్రవారం విడుదల చేసిన షెడ్యూల్ లో పేర్కొంది. ఓటర్లుగా పట్టభద్రులు పేర్లు నమోదు చేసుకునేందుకు డిసెంబర్ 30న సీఈఓ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఫిబ్రవరి 6వ తేదీ వరకూ దరఖాస్తులు(ఫామ్ 18)ను సమర్పించవచ్చు.

Advertisement

ఫిబ్రవరి 21 వరకూ ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ఫిబ్రవరి 24న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్, మార్చి 13 వరకూ అభ్యంతరాలు తెలియజేసేందుకు గడువు, మార్చి 29 వరకూ అభ్యంతరాల పరిష్కారానికి గడువు ఉంటుంది. పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా ఏప్రిల్ 4న విడుదల చేస్తారు.

.

Advertisement

.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×