BigTV English

Virat Kohli: ఓసారి ‘పురుగుల ఫ్రై’ తిన్న విరాట్.. అదంటే ఎంత ఇష్టమో చెప్పిన కోహ్లీ..

Virat Kohli: ఓసారి ‘పురుగుల ఫ్రై’ తిన్న విరాట్.. అదంటే ఎంత ఇష్టమో చెప్పిన కోహ్లీ..

Virat Kohli: విరాట్ కోహ్లీ రన్ మెషిన్. ఈ పరుగుల వీరుడికి ఆకలి కూడా ఎక్కువే. కెరీర్ మొదట్లో ఏదిపడితే అది తినేవాడు. ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారాక.. డైట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నాడు. ఇక, కోహ్లీ చాలాకాలం క్రితమే నాన్‌వెజ్ మానేశాడు. కంప్లీట్ వెజిటేరియన్‌గా మారాడు. కానీ, ఓ సమయంలో విరాట్.. ఓ వింత వంటకం రుచి చూశాడు. అదేంటో.. దాని టేస్ట్ ఎలా ఉందో ఆయనే వివరించాడు.


ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో గెలిచాక విరాట్‌ కోహ్లీ సోషల్‌ మీడియాలో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ నిర్వహించాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా తాను తిన్న ఓ ఘోరమైన కూర గురించి చెప్పాడు కోహ్లీ.

మలేషియాలో ఓ పురుగుల ఫ్రై తిన్నానని.. అదేంటో తెలియకుండానే తినేసినట్టు చెప్పాడు. కానీ రుచి చూశాక అసహ్యం వేసిందని వెల్లడించాడు.


ఇక, కోహ్లీకి అసలేమాత్రం ఇష్టం లేని వంటకం కూడా ఒకటుంది. ఇంతవరకీ దాన్ని ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదట. అదేంటంటే.. కాకరకాయ. శాకాహారి అయిన తాను తినని ఏకైక వంటకం కాకరకాయనే అని చెప్పాడు.

ఇక కోహ్లీ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఢిల్లీ వంటకమైన ‘చోలే బటూరే’. అదంటే మనోడు పడి చస్తాడట. ఎక్కడ కనిపించినా తినకుండా ఉండలేడట. ఇటీవల ఆసీస్‌తో రెండో టెస్టు జరుగుతున్నప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ ద్రవిడ్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా.. సిబ్బంది ఒకరు ఫుడ్‌ తీసుకొని వచ్చారు. ఆ వంటకం వైపు చూస్తూ కోహ్లీ.. వావ్‌ అంటూ చప్పట్లు కొట్టాడు. అది ‘చోలే బటూరే’. విరాట్ కి అదంటే అంతిష్టం.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×