IND Vs PAK : ఆసియా కప్ 2025 మ్యాచ్ లు జరిగిన విషయం తెలిసిందే. ఈ కప్ లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మద్య మ్యాచ్ వివాదాల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదాన్ని సంచలనం చేసిన విషయం తెలిసిందే. దాని కారణంగా అప్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో హోటల్ లోనే ఉండి.. గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. మరోవైపు సూపర్ 4 దశలో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ లో పాకిస్తాన్ క్రికెటర్లు టీమిండియాను అవమానపరిచారు. ముఖ్యంగా ఫర్హాన్ గన్ సంబురాలు.. హారిస్ రౌఫ్ సంజ్ఞలు సంచలనంగా మారాయి. దీంతో తాజాగా సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ ను కుక్కలతో పోల్చాడు.
Also Read : IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్షదీప్ అదిరిపోయే కౌంటర్..నీ తొక్కలో జెట్స్ మడిచి పెట్టుకోరా
ఇప్పుడు అది సంచలనంగా మారింది. కుక్కకి ట్రైనింగ్ ఇచ్చాడు. అతను చెప్పిన దానికి ఆ కుక్క కూడా మొరగడం.. సైలెంట్ గా ఉండటం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మొత్తానికి పాకిస్తాన్ ప్లేయర్ల ని కుక్కతో పోల్చాడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మరోవైపు పాకిస్తాన్ కి చెందిన హారిస్ రౌఫ్ గురించి సోషల్ మీడియాలో చర్చించడం విశేషం. మరోవైపు ఆసియా కప్ లో పాకిస్తాన్ జట్టు బలహీనంగా కనిపిస్తోందని వార్తలు వినిపించాయి. కానీ ఎప్పుడూ ఎలా ఆడుతారో మాత్రం చెప్పలేని పరిస్థితి నెలకొంది. గ్రూప్ దశలో శ్రీలంక తన అన్ని మ్యాచ్‌లను గెలిచింది. పాకిస్థాన్‌కు అత్యంత ముప్పుగా పరిణమిస్తున్న ఐదుగురు శ్రీలంక ఆటగాళ్లలో నువాన్ తుషార, పాతుమ్ నిస్సాంక, వానిందు హసరంగా, కుశాల్ మెండిస్, దాసున్ షనక ఉన్నారు.
నువాన్ తుషార గురించి చెప్పాలంటే, అతను ఆసియా కప్‌లో తన బౌలింగ్‌తో అసాధారణంగా రాణించాడు. గత ఆరేళ్లుగా అంటే సరిగ్గా 2180 రోజులుగా పాకిస్తాన్ శ్రీలంకను టీ20 ఇంటర్నేషనల్స్ లో ఓడించలేకపోయింది. ఇది ఆ జట్టుకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అక్టోబర్ 5, 2019 నుంచి ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌లు జరిగాయి, వాటిలో అన్ని మ్యాచ్‌ల్లోనూ శ్రీలంకనే గెలిచింది. ఈసారి కూడా ఓడితే.. పాకిస్తాన్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించడం ఖాయం. ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 18 సార్లు తలపడ్డాయి. ఇందులో శ్రీలంక ఏకంగా 13 సార్లు గెలిచి, పాకిస్తాన్ కేవలం 5 సార్లు మాత్రమే గెలిచింది. ఈ గణాంకాలు శ్రీలంకకు ఎంత అనుకూలంగా ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. గత ఎడిషన్‌లో కూడా ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచింది. పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆఫ్‌ఫీల్డ్, ఆన్‌ఫీల్డ్ సమస్యలతో సతమతమవుతోంది. సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ లేకపోవడం వల్ల బ్యాటింగ్ లైనప్ బలహీనంగా కనిపిస్తోంది. భారత్ చేతిలో ఓటమి తరువాత నెట్ రన్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది.
Indian Captain Surya Kumar Yadav with Dog 🐶 after India 🇮🇳 vs Pakistan 🇵🇰 Super 4 Match in Dubai
A well trained dog 🐕 pic.twitter.com/59zdaIuDcJ
— Richard Kettleborough (@RichKettle07) September 23, 2025