SL Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పటికే సూపర్ 4 లో రెండు జట్లు కూడా ఓటమి పాలయ్యాయి. పాకిస్తాన్ జట్టు టీమిండియాతో ఓటమి చెందితే.. శ్రీలంక జట్టు బంగ్లాదేశ్ పై ఓటమి పాలైంది. దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో ఎక్కువగా పాకిస్తాన్ జట్టునే విజయం సాధిస్తుంటే పలువురు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు.
Also Read : IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్షదీప్ అదిరిపోయే కౌంటర్..నీ తొక్కలో జెట్స్ మడిచి పెట్టుకోరా
అయితే డూ ఆర్ డై మ్యాచ్ కి ముందు శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది అనే చెప్పాలి. ప్రధాన పేసర్ పతిరణ ఈ మ్యాచ్ కి కూడా దూరం అయ్యాడు. పతిరణ గాయం కారణంగా శ్రీలంక ఆడిన గత రెండు మ్యాచ్ లకు కూడా దూరం ఉన్నాడు. అతను కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్ కి అందుబాటులోకి వస్తాడని శ్రీలంక మేనేజ్ మెంట్ భావించింది. అతని గాయం ఇంకా తగ్గకపోవడంతో నేటి పాక్ మ్యాచ్ కి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందే అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం జరగబోయే మ్యాచ్ శ్రీలంక జట్టుతో పాటు పాకిస్తాన్ కి కూడా చాలా కీలకమనే చెప్పాలి. ఇవాళ గెలిచిన జట్టుకే ఫైనల్స్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ శ్రీలంక విజయం సాధిస్తే.. మాత్రం భారత్ తో తప్పకుండా గెలవాలి. లేదంటే బంగ్లాదేశ్ మీద ఆధారపడాల్సి వస్తుంది.
వాస్తవానికి సూపర్ 4లో రెండు ఓటములు చెందితే ముందంజ వేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మిగతా జట్ల పై ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ జరిగే మ్యాచ్ లో శ్రీలంక, పాకిస్తాన్ రెండు జట్లకు కు కూడా పోరు కీలకం అనే చెప్పాలి. ముఖ్యంగా ప్రధాన బ్యాటర్లు కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, నిసాంక పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే బౌలింగ్ చమీరా, హసలంక అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు ఆల్ రౌండర్ శనక బంగ్లా పై కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం విధితమే. ఇక ఇప్పటి వరకు ఆకట్టుకోని కెప్టెన్ అసలంక ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ కోరుకుంటుంది.
పాకిస్తాన్ జట్టు :
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), కమిల్ మిషార, కుసల్ పెరీరా, చరిత్ అసలంక(c), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీర, నువాన్ తుషార.
శ్రీలంక జట్టు :
సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (c), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (wk), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.