ICC -USA: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎస్ఏ అంతర్జాతీయ సభ్యత్వాన్ని తాజాగా రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేసింది ఐసీసీ పాలకమండలి. పదేపదే నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ఐసీసీ స్పష్టం చేసింది. దీంతో ఇకపై యుఎస్ఏ క్రికెట్… అధికారికంగా ఎక్కడ ఆడబోదన్నమాట. ఇక ఆ జట్టు కనుమరుగు అయిపోయినట్లే అని చెబుతున్నారు.
Also Read: Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ
జాతీయస్థాయిలో గవర్నమెంట్ బాడీ హోదాను పొందడంలో పురోగతి లేకపోవడం అలాగే సంస్థ గత నిర్మాణంలో వైఫల్యం… దానికి తోడు యూఎస్ తో పాటు అంతర్జాతీయంగానూ క్రికెట్ ను దెబ్బతీసేలా వ్యవహరించడం లాంటి అంశాలను… పరిగణలోకి తీసుకొని ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు ఐసిసి వెల్లడించింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈవెంట్లలో యూఎస్ఏ ఎక్కడ పాల్గొనదు. అనధికారిక టోర్నమెంట్లలో యూఎస్ఏ పాల్గొనే ఛాన్సులు ఉన్నాయి. ఐసీసీ నిర్ణయం తీసుకోవడంతో.. క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరొకసారి యూఎస్ఏ క్రికెట్ బోర్డు కు ఛాన్స్ ఇస్తే బాగుండేదని అంటున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గాండ్రించింది. అమెరికా క్రికెట్ ను రద్దు చేసింది ఐసీసీ. తమ రూల్స్ సరిగ్గా పాటించడం లేదన్న ముఖ్య కారణంతోనే ఈ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఆ జట్టులో పాలనా పరమైన లూజ్ పోల్స్ సెట్ చేయకపోవడం అదే సమయంలో…. నిర్దేశిత టైంలో సంస్కరణలు చేయలేదు అమెరికా క్రికెట్. దీంతో… ఆ జట్టును రద్దు చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఈ ప్రక్రియ చేసేందుకు 12 నెలల సమయంలో.. గత ఏడాది ఇచ్చారు.అయినా.. అమెరికా క్రికెట్ అడుగు ముందుకు వేయలేదు. దీంతో.. పనిష్ చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. మరి దీనిపై అమెరికా ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.
వాస్తవంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైశా… అధ్యక్షతన ఏర్పడిన ఐసీసీ నార్మలైజేషన్ కమిటీ అలాగే అమెరికా క్రికెట్ బోర్డు తిరిగి సభ్యత్వ హక్కులు పొందేందుకు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇందులో స్పష్టమైన మార్పులు, అదే సమయంలో సమర్థవంతమైన పరిపాలన ఉంటాయి. ముఖ్యంగా క్రికెట్ వ్యవస్థలో స్థిరత్వం సాధించడం చాలా ప్రధానమైన సంగతి తెలిసిందే. ఇందులోని ఏ ఒక్క రూల్ పాటించకపోతే కచ్చితంగా ఐసీసీ యాక్షన్ తీసుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia cup 2025) భాగంగా రిఫరీ ఆండీ విషయంలో కూడా పాకిస్తాన్ రచ్చ చేసింది. కానీ ఐసీసీ సీరియస్ అయింది. మ్యాచ్ ఆడకపోతే.. ఫైన్ చెల్లించండి అంటూ వార్నింగ్ ఇచ్చింది. దెబ్బకు పాకిస్థాన్ దిగివచ్చింది. అలా ఉంటుంది మరీ.
Also Read: IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్షదీప్ అదిరిపోయే కౌంటర్..నీ తొక్కలో జెట్స్ మడిచి పెట్టుకోరా
USA CRICKET SUSPENDED BY ICC
They came, they played, they defeated Pakistan and then got suspended. Mission accomplished. pic.twitter.com/DqHRdrXf5x
— Vipin Tiwari (@Vipintiwari952) September 23, 2025