IND VS BAN: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో మరో అదిరిపోయే ఫైట్ కోసం సిద్ధమైంది టీమిండియా. సూపర్ ఫోర్ దశలో పసికూన బంగ్లాదేశ్ జట్టుతో… టీమిండియా కు ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే నేరుగా ఫైనల్ కు వెళ్ళనుంది. ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా ఈ మ్యాచ్ లో గెలవాలని శ్రీలంక అలాగే పాకిస్తాన్ అభిమానులు…. గుళ్ళు గోపురాల జుట్టు తిరుగుతున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా గనక విజయం సాధిస్తే… శ్రీలంక అదే సమయంలో పాకిస్తాన్ కు ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ బంగ్లాదేశ్ గనుక విజయం సాధిస్తే.. పాకిస్తాన్, శ్రీలంక నేరుగా ఇంటికి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. అది పూర్తిగా రన్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది. అందుకే బంగ్లాదేశ్ పైన టీం ఇండియా గెలవాలని… శ్రీలంక అదే సమయంలో పాకిస్తాన్ కోరుకుంటున్నారు.
Also Read: IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్షదీప్ అదిరిపోయే కౌంటర్..నీ తొక్కలో జెట్స్ మడిచి పెట్టుకోరా
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ వేదిక కానుంది. సోనీ లో ప్రసారమవుతున్న ఈ మ్యాచ్… భారత కాల మానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. అంటే దాదాపు రాత్రి 12 గంటల సమయం వరకు మ్యాచ్ కొనసాగుతుంది. ఇప్పటికే సూపర్ ఫోర్ లో బంగ్లాదేశ్ అలాగే టీమిండియా చెరో మ్యాచ్ గెలిచి.. దూకుడు పైన ఉన్నాయి. ఇందులో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్ బెర్తు దాదాపు ఫైనల్ చేసుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు మరొక అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. క్రీడా విశ్లేషకులు అంచనా ప్రకారం…. బంగ్లాదేశ్ పైన టీమిండియా విజయం సాధించే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అద్భుతం జరిగితే తప్ప టీమిండియా ఓడిపోవడం చాలా కష్టమని అంటున్నారు. ఇక అటు ఈ మ్యాచ్ లో కచ్చితంగా టీమిండియాను ఓడిస్తామని బంగ్లాదేశ్ కోచ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ
భారత్ ప్రాబబుల్ XI: శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (సి), సంజు శాంసన్ (ఈర), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
బంగ్లాదేశ్ ప్రాబబుల్ XI : సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, లిట్టన్ దాస్ (c & wk), తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్.