Abrar Ahmed – Wanindu Hasaranga: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య నిన్న ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లకు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. కానీ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. శ్రీలంక జట్టుపై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్. ఈ విజయంతో ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ బెర్త్ కోసం ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Also Read: IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్షదీప్ అదిరిపోయే కౌంటర్..నీ తొక్కలో జెట్స్ మడిచి పెట్టుకోరా
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్లో భాగంగా నిన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక ఫైట్ లో ఓ అరుదైన సంఘటన జరిగింది. పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ చేసిన పనికి.. శ్రీలంక ఆల్రౌండర్ హసరంగ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఏం పీక్కుంటావో పీక్కో అన్న రేంజ్ లో.. బౌలింగ్ అదరగొట్టి కౌంటర్ ఇచ్చాడు హాసరంగా. వాస్తవానికి శ్రీలంక ముందు బ్యాటింగ్ చేయగా… ఆ సమయంలో శ్రీలంక ఆటగాడు హసరంగా… అక్బర్ అహ్మద్ బౌలింగ్లో 15 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం అసభ్యకరమైన సైగలతో… అబ్రర్ అహ్మద్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఆ సమయంలో ఏమీ చేయలేక పెవిలియన్ కు వెళ్లిపోయాడు హసరంగా. అనంతరం శ్రీలంక బౌలింగ్ చేస్తున్న సమయంలో… హసరంగా దుమ్ములేపాడు. ఈ తరుణంలోనే.. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా, అయూబ్ వికెట్ తీసిన హసరంగా… అబ్రర్ అహ్మద్ కౌంటర్ ఇచ్చాడు. అరే పోరా పో.. అన్నట్లు సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే.. మ్యాచ్ తర్వాత…ఇద్దరూ కలిసిపోయి.. షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు.
నిన్న జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది శ్రీలంక. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్నిత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 133 పరుగులు మాత్రమే చేసింది. టాపోర్టర్ అలాగే మిడిల్ ఆర్డర్ ఎవరు కూడా పెద్దగా రాణించలేదు. కేవలం కమింద్ మెండిస్ ఒకటి 50 పరుగులు చేసి దుమ్ము లేపాడు. అలాగే కుషల్ మెండిస్, శనకా ఇద్దరు డక్ ఔట్ అయ్యారు. దీంతో… 133 పరుగులకే 8 వికెట్లు నష్టపోయింది శ్రీలంక. ఇక ఆ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేదించింది. 18 ఓవర్లలోనే ఐదు వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ లక్ష్యాన్ని చేదించి… దుమ్ము లేపింది. అయితే ఈ ఓటమి నేపథ్యంలో శ్రీలంక ఇంటికి వెళ్లే పరిస్థితి వచ్చింది. రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన శ్రీలంక.. దాదాపు ఇంటికి వెళ్లినట్లే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ
That was so cool by Abrar Ahmad, Hasaranga's celebration 😭 pic.twitter.com/hzEjQOhbj7
— Azlan (@azlanxz) September 23, 2025
Wanindu Hasaranga celebration. 🔥pic.twitter.com/5gD6Z9RzT4
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 23, 2025
?igsh=MTN6ZXZkYzIxenhzdg==
?utm_source=ig_web_copy_link