BigTV English

ICC Test Ranking : టాప్ 10లో భారత్ నుంచి ఒకే ఒక్కడు..!

ICC Test Ranking : టాప్ 10లో భారత్ నుంచి ఒకే ఒక్కడు..!

ICC Test Ranking : ఒక్క టెస్ట్ మ్యాచ్ లో ఓటమి పాలయ్యేసరికి ఆటగాళ్ల ర్యాంకులు కూడా దభీదభీమని కిందకు పడిపోయాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌనిల్స్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్-10లో నిలిచాడు. 767 రేటింగ్ పాయింట్స్ తో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.


హైదరాబాద్ తో జరిగిన తొలి టెస్ట్ లో విరాట్ ఆడలేదు. అయినా ఆరో స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 729 రేటింగ్ పాయింట్స్‌తో ఒక స్థానం దిగజారి 12కి వెళ్లాడు. ఏడాదిగా ఆటకు దూరంగా ఉన్న రిషబ్ పంత్ 721 రేటింగ్ పాయింట్స్‌తో 13వ స్థానంలో కొనసాగుతున్నాడు.

మొదటి స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (864) మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్ (832) రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా నుంచి స్టీవ్ స్మిత్ (818) మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ నుంచి డారిల్ మిచెల్  (786) నాలుగో స్థానంలో, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ (768) ఐదో స్థానంలో ఉన్నాడు.


టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 853 రేటింగ్ పాయింట్స్‌తో ఎప్పటిలా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

టీమ్ ఇండియా నుంచి జస్‌ప్రీత్ బుమ్రా నాలుగో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడా, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తమ టాప్-2 ర్యాంకులను నిలబెట్టుకున్నారు. అక్షర్ పటేల్ ఆరో స్థానానికి వెళ్లాడు.

టీమ్ ఇండియా ఆటగాళ్లు ఎప్పుడూ వ్యక్తిగతంగా రికార్డులు పెంచుకోవడమే గానీ, ఒక జట్టుగా సమైక్యంగా సాధించేవి తక్కువనే విమర్శలున్నాయి. ప్రస్తుతం టీమ్ ఇండియా జట్టు పటిష్టంగా కనిపిస్తున్నా ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో టాప్ టెన్ లో అన్ని విభాగాల్లో కలిపి 30 మందికి ఏడుగురే కనిపిస్తున్నారు.

బ్యాటర్లలో కొహ్లీ ఒక్కరే ఉన్నారు,  బౌలింగ్ లో అశ్విన్, బుమ్రా, జడేజా ముగ్గురున్నారు. ఆల్ రౌండర్లలో జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ ఉన్నారు. వీరిలో అశ్విన్, జడేజా అక్కడ, ఇక్కడా కూడా ఉన్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×