Big Stories

YS Sharmila : ఏపీ కోసం కాంగ్రెస్ పోరుబాట.. ఢిల్లీలో షర్మిల దీక్ష..

YS Sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి తన పర్యటనలకు శ్రీకారం చుట్టిన షర్మిల నేరుగా తన అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. నేరుగా సీఎం జగనే నిలదీశారు. ఏపీలో బీజేపీ అంటే కొత్త అర్థం చెప్పారు. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అని సెటైర్లు వేశారు. బీజేపీతో వైసీపీకి అనధికార పొత్తు ఉందని విమర్శలు గుప్పించారు. ఏపీ విభజన హామీలపై ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై కేంద్ర మెడలు ఎందుకు వంచలేకపోయారని గట్టిగా నిలదీశారు.ఈ క్రమంలో బీజేపీ పోరాటానికి షర్మిల సిద్ధమవుతున్నారు.

- Advertisement -

ఫిబ్రవరి 1న రాత్రికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకోనున్నారు. రెండో తేదీ ఉదయం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో నేతలు భేటీకానున్నారు. కాంగ్రెస్‌ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల నిర్ణయంతోనే కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాటపడుతున్నారు. రాష్ట్రవిభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రంలో తాజా పరిస్థితుల నేపథ్యాన్ని జాతీయ నేతలకు వివరించాలని భావిస్తున్నారు.

- Advertisement -

గత నాలుగున్నరేళ్లుగా ఏపీలో నెలకొన్న పరిస్థితులను కూడా జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీతారాం ఏచూరి సహా విపక్ష నేతలను కలవాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 2న మధ్యాహ్నం జంతర్ మంతర్‌లో కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టనున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రత్యేకహోదాపై గట్టిగా మాట్లాడారు. ఎంపీలను ఎక్కువ మంది గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని పదేపదే ప్రకటనలు గుప్పించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది లోక్ సభకు ఎన్నికయ్యారు. కానీ ఒక్కసారి కూడా ఏపీ విభజన హామలపై గళం విప్పలేకపోయారనే విమర్శలున్నాయి. విశాఖ రైల్వే జోన్ సాధించడంలో వైసీపీ ఎంపీలు విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చాలా బిల్లులు విషయంలో అటు లోక్ సభలోనూ , ఇటు రాజ్యసభలో బీజేపీకి వైసీపీ సహకరించింది. కానీ ఏపీ విభజన హామీలను అమలు చేయించుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ హక్కుల సాధనకు నడుబిగిస్తోంది. టీపీసీసీ చీఫ్ షర్మిల నేతృత్వంలోనూ పోరుబాటకు సిద్ధమైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News