BigTV English

Virat Kohli : 2023 వరల్డ్ కప్ ఫైనల్.. బెయిల్స్ గిరాటేసిన కోహ్లీ.. వీడియో వైరల్..

Virat Kohli : 2023 వరల్డ్ కప్ ఫైనల్.. బెయిల్స్ గిరాటేసిన కోహ్లీ.. వీడియో వైరల్..

Virat Kohli : ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆలోచనలు, ఆనందాలు, విషాదాలు, మరిచిపోలేని బాధలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. సెలబ్రిటీలు కూడా మనుషులే. వారేమీ దైవాంశ సంభూతులు కాదు.  వారికి అందరిలా కోపం వస్తుంది. దానిని వ్యక్తీకరించుకోడానికి, వారివారి మానసిక స్థితిగతులను బట్టి రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. దానిని వ్యక్తీకరిస్తూ ఉంటారు.


క్రికెట్ లోకి వస్తే చాలామంది బ్యాటర్లు తమ వికెట్ పోగానే బాధతో నలిగిపోతుంటారు. మంచిగా ఆడే సమయంలో అవుట్ అయిపోతే ఆ బాధ మరింత వర్ణణాతీతంగా ఉంటుంది. దాంతో గ్రౌండ్ లోనే కోపాన్ని ఆపుకోలేక పిచ్చి కేకలు వేస్తుంటారు. ఈమధ్య కాలంలో శుభ్ మన్ గిల్ అవుట్ కాగానే అలా అరుస్తున్నాడు.

కొంతమంది బ్యాటర్లు చాలా సీరియస్ గా వచ్చి, డ్రెస్సింగ్ రూమ్ కి వెళుతూ అక్కడ గ్రౌండ్ లో కుర్చీలను వాటిని బ్యాట్ తో కసిగా కొట్టేసి, లేకపోతే వాటిని కాళ్లతో తన్నేసి వెళ్లిపోతుంటారు. ఇలా చేసిన చాలామంది పనిష్మెంట్లకు గురవుతుంటారు. ఐసీసీ నిబంధనల ప్రకారం గ్రౌండ్ లో వస్తువులకు నష్టం చేకూర్చకూడదనే నిబంధన ఉండటంతో చాలామంది కంట్రోల్ అవుతుంటారు.


కొందరు తమ బ్యాట్లను కాళ్లకేసి కొట్టుకుంటారు, కొందరు నేలకేసి కొడతారు. కొందరు బ్యాట్ ని స్పీడ్ గా అటూ ఇటూ ఊపుకుంటూ గ్రౌండ్ విడిచి వెళ్లిపోతారు. కొందరు అవుట్ కాగానే ఆకాశంవైపు చూసి, తమ బాధను దిగమింగుకోడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడివన్నీ ఎందుకంటే విరాట్ కొహ్లీ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది.

విషయం ఏమిటంటే ..2023 వన్డే వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా వరుసగా 10 మ్యాచ్ లు గెలిచింది. అభిమానుల ఆశలను మ్యాచ్ మ్యాచ్ కి మధ్య పీక్స్ కి తీసుకువెళుతూ అద్భుతాలు చేసింది. సరిగ్గా ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో చావు దెబ్బ తిని చతికిలపడిపోయింది.

ఈసారి కప్ ఎలాగైనా సాధించాలని కసిగా ఆడిన టీమ్ ఇండియా ప్లేయర్లు చాలా డిజప్పాయింట్ అయ్యారు. ప్రజలకి ముఖం చూపించలేకపోయారు. ఆరోజున  అహ్మదాబాద్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియన్లు సంబరాలు చేసుకంటుంటే టీమ్ ఇండియా ఆటగాళ్లు బాధాతప్త హృదయంతో గ్రౌండ్ ను విడిచారు.

విరాట్ కొహ్లీ కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లో థర్డ్ మ్యాన్ నుంచి ఒక్కడూ వికెట్ల మీదుగా నడుచుకుంటూ వెళుతూ, ఆ వికెట్ల వద్దకు రాగానే, తన క్యాప్ తీసి ఆ వికెట్ల పైన బెయిల్స్ ను కిందకు పడగొట్టాడు. అవి పడకపోతే పడేవరకు టోపీతో ఊపుతానే ఉన్నాడు. అవి పడిన తర్వాతే అక్కడ నుంచి కదిలాడు. అలా తన అసంత్రప్తిని వ్యక్తం చేస్తూనే, తన మనసులోని బాధను మౌనంగా వ్యక్తీకరించాడు.

దీనర్థం ఏమిటంటే.. 140 కోట్ల మంది భారతీయులు కలలుగన్న వరల్డ్ కప్ కల క్లీన్ బౌల్డ్ అయిందని, బెయిల్ కిందపడిపోయిందని  క్రికెట్ భాషలోనే చెప్పాడు. ఒక్క కొహ్లీ యే కాదు, ప్రతీ క్రికెటర్ కూడా మోయలేనంత భారాన్ని గుండెల్లో మోసుకుంటూ మైదానాన్ని వీడారు. ఇప్పుడు  క్యాప్ తో ఆ బెయిల్స్ ను పడగొట్టిన కొహ్లీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×