BigTV English

Virat Kohli : విరాట్ రికార్డ్!.. దాటేది ఎవరు?

Virat Kohli : విరాట్ రికార్డ్!.. దాటేది ఎవరు?
This image has an empty alt attribute; its file name is a9e937219d4d20d5c0d053a34964593a.jpg

Virat Kohli : వన్డేల్లో 49వ సెంచరీ చేసి, సచిన్ రికార్డ్ ని సమం చేసిన విరాట్ కోహ్లీ కొత్త కొత్త రికార్డులను బద్దలు కొడుతూ ముందుకెళ్లాడు. ఎవరికి సాధ్యం కాదని అనుకునే సచిన్ రికార్డ్  సాధించి శభాష్ అనిపించాడు.


క్రికెట్ పుట్టి ఎన్నోఏళ్లయ్యింది. అందులో వన్డే మ్యాచ్‌‌లు ప్రారంభమైన తర్వాత ఏ ఆటగాడు కూడా సచిన్ లా 49 సెంచరీలు చేయలేదు. టెస్ట్ మ్యాచ్ ల్లో చేసిన  51 సెంచరీలు కలిపి మొత్తం 100 సెంచరీలు చేసిన వీరుడిలా సచిన్ శిఖరాగ్రానికి చేరుకున్నాడు.

ఇప్పట్లో ఈ రికార్డు కొట్టేవాళ్లే లేరని అంతా అనుకున్నారు. కానీ 12 ఏళ్లు గడిచింది. భారతదేశం నుంచే ఆ రికార్డుని కొట్టే మొనగాడు ఒకడొచ్చాడు. తనే క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ.. అయితే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యమే. ఈ రికార్డ్‌ని కొహ్లీ తర్వాత కొట్టే మొనగాడెవడు? అని… అందుకే ఆ లెక్కేమిటో ఒకసారి చూద్దాం…


విరాట్ కోహ్లీ (49) తర్వాత సచిన్ (49) ఉన్నాడు. కానీ తను రిటైర్ అయిపోయాడు. మూడో స్థానంలో రోహిత్ శర్మ (31) ఉన్నాడు. ఇప్పటికే 36 ఏళ్లు వచ్చిన రోహిత్‌కి అంత అవకాశం లేదు. నాలుగో స్థానంలో రికీ పాంటింగ్ (30) ఆస్ట్రేలియా , సనత్ జయసూర్య (28)  శ్రీలంక, హెచ్. ఆమ్లా  (27) సౌత్ ఆఫ్రికా, డీవిలియర్స్ (27) సౌతాఫ్రికా, క్రిస్ గేల్ (25) వెస్టిండీస్, సంగక్కర (25) శ్రీలంక, గంగూలీ (22) ఇండియా ఉన్నారు. వీరందరూ రిటైర్ అయిపోయారు. అందుకని వీరితో భయం లేదు.

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (22), సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్ (22) సెంచరీలు చేశారు. ఇద్దరూ ఆడుతున్నారు గానీ, ప్రస్తుత వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతారని అంటున్నారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 19 సెంచరీలతో ఉన్నాడు. నెంబర్ వన్ బ్యాటర్‌గా కూడా ఉన్నాడు. అయితే 29 ఏళ్ల బాబర్ ఇంకెన్నాళ్లు క్రికెట్ ఆడతాడో తెలీదు. ఒకవేళ మరో ఐదేళ్లు ఆడినా, 31 సెంచరీలు చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

ఇంగ్లాండ్ బ్యాటర్‌ 32 ఏళ్ల జో రూట్ ఇప్పటివరకు 16 సెంచరీలు చేశాడు. వీరి తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (13), స్టీవ్ స్మిత్ (12), ఫఖర్ జమాన్ (11), బెయిర్ స్టో (11), జాస్ బట్లర్ (11) ఉన్నారు.

ఈ లెక్కలన్నీ చూస్తే, మన ఇండియా నుంచే మరొకరు కనిపిస్తున్నారు. అతనే శుభ్ మన్ గిల్. ఆడిన 35 మ్యాచ్ ల్లో 6 సెంచరీలు చేశాడు. తనకింకా పదేళ్ల కెరీర్ ఉంది. ఇలాగే లాగిస్తే, ఇలాగే ఆడితే ఒక అవకాశమైతే ఉంది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×