Virat fans in Islamabad: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం భారత్ లోనే కాకుండా విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో అభిమానులు ఉన్నారు. దాయాది దేశం పాకిస్తాన్ లో కూడా విరాట్ కోహ్లీకి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్ బేస్ మరోసారి నిరూపితం అయ్యింది. ఈ సెంచరీతో కోట్లాదిమంది భారతీయులను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల హృదయాలను మరోసారి కొల్లగొట్టాడు.
ఆదివారం జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టి తన సెంచరీతో పాటు భారత్ కి విజయాన్ని అందించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ బ్యాట్ నుండి వచ్చిన 82వ సెంచరీ ఇది. తన ఫామ్ ని విమర్శించిన వారికి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మరోసారి సమాధానం ఇచ్చాడు విరాట్. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకొని.. పూర్తి ఓవర్లు ఆడకుండానే 241 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. పాకిస్తాన్ బ్యాటర్లలో సౌద్ షకీల్ {62} హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రిజ్వాన్ 46, కుష్ దిల్ షా {38} పరుగులు చేశారు.
భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2, కుల్దీప్ యాదవ్ 3, రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత జట్టు 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారత జట్టు. భారత బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ {20} పరుగులకే పెవిలియన్ చేరగా.. గిల్, శ్రేయస్ అయ్యర్ లతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకోల్పాడు విరాట్ కోహ్లీ. 111 బంతులలో 7 ఫోర్ లతో వంద పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ సాధించాలనే తన కలను కూడా నెరవేర్చుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన సెలబ్రిటీలు సాధారణ వ్యక్తుల్లా భారత విజయాన్ని ఆస్వాదించారు. ఇక పాకిస్తాన్ సిటిజెన్లు కూడా విరాట్ కోహ్లీ వారి జట్టుపై సెంచరీ చేసినా సెలబ్రేట్ చేసుకున్నారు. విరాట్ సెంచరీ అనంతరం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో సంబరాలు జరిగాయి. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉన్న అంతరాన్ని మరిచి విరాట్ కోహ్లీ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నారు పాకిస్తాన్ క్రీడాభిమానులు.
దీంతో పాకిస్తాన్ క్రీడాభిమానుల సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే కాశ్మీర్ ప్రాంతంలోనూ భారత అభిమానులు రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ బాణాసంచా కాల్చారు. ఇలా ఆదివారం రోజు కోహ్లీ నామస్మరణతో క్రికెట్ ప్రపంచం దగ్గరిల్లింది. ఇక విరాట్ కోహ్లీ సెంచరీపై అనుష్క శర్మ కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందించింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో కోహ్లీ స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ.. ” నీ ప్రేమకు దాసోహం” అనే అర్థంలో హార్ట్ ఎమోజీలతో తన భావాలను వ్యక్తం చేసింది.
SHOCKING NEWS 🚨 MASSIVE CELEBRATIONS in Pakistan after Pak's defeat & VIRAT KOHLI's Century 🤯 Civil War in Pak? pic.twitter.com/tGwMkQQqy6
— Times Algebra (@TimesAlgebraIND) February 23, 2025