IND VS AUS: ప్రస్తుతం ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో…. టీమిండియా ఫుల్ బిజీగా ఉంది. అయితే వచ్చే నెలలో టీమిండియా మరో రసవత్తర ఫైట్ కు సిద్ధం కానుంది. అరి వీర భయంకరమైన బ్యాటర్లు ఉన్న ఆస్ట్రేలియా జట్టుతో… వన్డేలు అలాగే టి20 లు ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ లో జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో వన్డే జట్టులోకి కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వస్తారని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ గురించి తెలియదు కానీ… విరాట్ కోహ్లీ మాత్రం.. రావడం లేదని తేలిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్షదీప్ అదిరిపోయే కౌంటర్..నీ తొక్కలో జెట్స్ మడిచి పెట్టుకోరా
ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య త్వరలో వన్డే సిరీస్ జరగనున్న నేపథ్యంలో… అతి త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు. ఇందులో కోహ్లీ ఆడతాడా లేదా అని.. బిసిసిఐ బృందం లో సభ్యుడు అయిన.. అజిత్ అగర్కార్ ఫోన్ చేశారట. అయితే విరాట్ కోహ్లీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని సమాచారం. దీంతో అతన్ని ఈ వన్డేలకు సెలెక్ట్ చేసే అవకాశం లేనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
విరాట్ కోహ్లీ ఫోన్ లిఫ్ట్ చేయని నేపథ్యంలో కొత్త ప్లేయర్ ను జట్టులోకి తీసుకురావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆలోచన చేస్తోందట. ఇందులో భాగంగానే వన్డేల్లోకి అభిషేక్ శర్మ అని కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. అందుకే అతన్ని విరాట్ కోహ్లీ స్థానంలో వన్డేల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. దాదాపు ఇప్పటికే అతనికి సమాచారం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ
టీమిండియా వర్సెస్ ఆసీస్ వన్డే సిరీస్ కు ఇప్పటికే ముహుర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ మాసంలో టీమిండియా వర్సెస్ ఆసీస్ వన్డే సిరీస్ జరుగనుంది. టీ20 లు కూడా జరుగనున్నాయి. ఈ సిరీస్ అక్టోబర్ 19 వ తేదీ నుంచి నవంబర్ 9 వ తేదీ వరకు కొనసాగనుంది. అక్టోబర్ 19వ తేదీ నుంచి మూడు వన్డేలు జరుగుతాయి. అక్టోబర్ 19 వ తేదీ మొదటి వన్డే, అక్టోబర్ 23న రెండో వన్డే, అక్టోబర్ 25వ తేదీన మూడో వన్డే జరుగనుంది. ఇక అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు 5 టీ20 లు టీమిండియా వర్సెస్ ఆసీస్ మధ్య జరుగుతాయి. ఇక ఈ సీరిస్ కోసం అతి త్వరలోనే జట్లను ప్రకటించనుంది భారత క్రికెట్ మండలి.