India vs Bangladesh: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో భాగంగా… ఇవాళ టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు.. బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. దుబాయ్ క్రికెట్ స్టేడియం ఇవాళ సెకండ్ బ్యాటింగ్ చేసేవారికి అనుకూలంగా ఉంటుందని… పిచ్ క్యూరేటర్లు తేల్చారు. దీంతో.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు.. బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
Also Read: IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్షదీప్ అదిరిపోయే కౌంటర్..నీ తొక్కలో జెట్స్ మడిచి పెట్టుకోరా
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో ( Asia Cup 2025 Super Four ) భాగంగా… ఇవాళ టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Team India vs Bangladesh ) మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. అయితే… ఇందులో గెలిచిన టీం నేరుగా ఫైనల్ కు వెళుతుంది. ఇప్పటికే శ్రీలంక జట్టుపై ఒక మ్యాచ్ గెలిచింది బంగ్లాదేశ్. ఇవాళ గెలిస్తే… 4 పాయింట్స్ వస్తాయి. మరో మ్యాచ్ పాకిస్థాన్ తో ఉంటుంది. అందులో ఓడినా… రన్ రేట్ కాపాడుకుంటే చాలు. నేరుగా ఆసియా కప్ 2025 ఫైనల్స్ కు వెళ్లవచ్చు. ఇక టీమిండియా విషయానికి వస్తే… ఇందులో గెలిస్తే.. నేరుగా ఫైనల్స్ కు దూసుకెళుతుంది. మరో మ్యాచ్ శ్రీలంకతో ఆడాల్సి ఉంటుంది. ఇందులో ఓడినా… రన్ రేట్ అద్భుతంగా ఉంది. అలా చూసినా…నేరుగా ఫైనల్స్ కు దూసుకెళుతుంది టీమిండియా. ఇక ఇవాళ్టి మ్యాచ్ ఏ జట్టు ఓడినా.. మరో మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. కాగా….. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రికార్డులు పరిశీలిస్తే… ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 17 టీ20లు జరిగాయి. ఇందులో 16 మ్యాచ్ లలో టీమిండియానే విజయం సాధించింది. అటు బంగ్లాదేశ్ మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ ప్రదర్శన చూస్తే… టీమిండియాదే పైచేయి అని చెప్పవచ్చు. ఇవాళ్టి మ్యాచ్ లో కూడా టీమిండియా గెలుస్తుందని అంటున్నారు.
Also Read: Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ
బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా జట్లు:
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(w/c), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రాహ్
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి