Explosion in fireworks godown: తమిళనాడు భారీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మపురి సమీపంలోని కంపైనల్లూరులో ఓ బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు.
ALSO READ: RRB Recruitment: గుడ్ న్యూస్.. రైల్వేలో భారీ ఉద్యోగాలకు మరోసారి దరఖాస్తు గడువు పొడగింపు..
వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలోని కంపైనల్లూరు ప్రాంతంలో చిన్నదురై అనే వ్యక్తికి బాణాసంచా తయారుచేసి విక్రయిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు బాణాసంచా గోడౌన్ లో ఇవాళ పటాకులు తయారు చేస్తున్నారు. అందులో ఒకరు తినడానికి వెళ్లగా.. మరో ముగ్గురు మహిళలు క్రాకర్స్ తయారు చేసే పనిలో ఉన్నారు. అదే సమయంలో గోడౌన్ లో బాణాసంచా తయారు చేస్తున్న ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ALSO READ: CM Revanth Reddy: అందుకోసమే కదా బీఆర్ఎస్, బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది: సీఎం రేవంత్ రెడ్డి
భారీ ఎత్తున మంటలు ఎగిపడడంతో ముగ్గురు మహిళల శరీర భాగాలు తునాతునకులుగా వేరు వేరు ప్రాంతాల్లో పడిపోయాయి. ముగ్గురు మహిళలు గుర్తించలేనంత దారుణంగా మృతిచెందారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు మహిళలను తిరుమంజు, తిరుమల్లర్, చేన్పగంగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ధర్మపురి జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.