Vaibhav Suryavanshi : 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గురించి తెలియని వారు ఉండరు. మొన్నటి ఐపిఎల్ జరిగినన్ని రోజులు వైభవ్ సూర్యవంశీ పేరు మారు మోగింది. అయితే ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాడు ఈ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. అండర్ 19 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ మ్యాచ్ జరగగా… టీమిండియా అద్భుతంగా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో 70 పరుగులు చేసిన వైభవ్ సూర్య వంశీ అదిరిపోయే రికార్డు సొంతం చేసుకున్నాడు. తన 14 ఏళ్ల వయసులో వన్డేలలో 41 సిక్సులు కొట్టిన యంగ్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. దీంతో మరోసారి రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ పేరు వైరల్ గా మారింది.
Also Read: IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్షదీప్ అదిరిపోయే కౌంటర్..నీ తొక్కలో జెట్స్ మడిచి పెట్టుకోరా
అండర్ 19 టీమిండియా వర్సెస్ అండర్ 19 ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండవ వన్డే మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్ బెన్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 51 పరుగుల తేడాతో అండర్ 19 టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన అండర్ 19 టీమ్ ఇండియా 300 కు పైగా పరుగులు చేసింది. 49.4 ఓవర్స్ లో సరిగ్గా 300 పరుగులు చేసిన టీమిండియా ఆల్ అవుట్ అయింది.
టీమిండియా కెప్టెన్ ఆయుష్ డక్ అవుట్ అయినప్పటికీ… వైభవ్ సూర్య వంశీ , విహాన్ మల్హోత్ర, అభిజ్ఞాన్ కుండు ముగ్గురు కలిసి 210కి పైగా పరుగులు చేశారు. ఒక్కో ఆటగాడు 70కి పైగా పరుగులు చేసి రఫ్ ఆడించారు. దీంతో 300కు పైగా పరుగులు చేసింది టీమిండియా. అనంతరం చేదింగుకు దిగిన ఆస్ట్రేలియా… రాణించే ప్రయత్నం చేసింది. కానీ టాప్ ఆర్డర్ పెద్దగా రాణించకపోవడంతో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన జడేన్ డ్రాపర్ 107 పరుగులతో దుమ్ము లేపాడు. ఇందులో 5 సిక్సర్లు అలాగే 8 బౌండరీలు ఉన్నాయి. 72 బంతుల్లోని 107 పరుగులు చేశాడు డ్రాపర్. అయితే అతనికి మిగతా బ్యాటర్లు పెద్దగా సపోర్ట్ చేయకపోవడంతో… ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో ఓడిపోయింది.
14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ వైభవ్ ఇవాళ్టి మ్యాచ్ లో 6 సిక్సులు బాదేశాడు. దీంతో.. అరుదైన రికార్డు సృష్టించాడు. తన వన్డే కెరీర్ లో ఇప్పటి వరకు 41 సిక్సులు కొట్టేశాడు. ఈ 41 సిక్సులు కేవలం 10 ఇన్నింగ్స్ లలో పూర్తి చేశాడు. అలా కొట్టిన తొలి ప్లేయర్ గా 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. వైభవ్ సూర్య వంశీ తర్వాత…ఉన్మ్‌క్త్ చంద్ ఉన్నాడు. అతను 21 ఇన్నింగ్స్ లలో 38 సిక్సులు బాదేశాడు.
Also Read: Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ
Teenage sensation Vaibhav Suryavanshi smashes the all-time Youth ODI sixes record during the second India U-19 vs Australia U-19 match.#VaibhavSuryavanshi pic.twitter.com/sYSLeMUK9g
— CricTracker (@Cricketracker) September 24, 2025