E-Paper
Advertisement

Gautam Gambhir: పొర్లు దండాలు పెట్టినా, 2027 వరల్డ్ కప్ లో ఆ ఇద్దరినీ ఆడనివ్వను ?

Gautam Gambhir: పొర్లు దండాలు పెట్టినా, 2027 వరల్డ్ కప్ లో ఆ ఇద్దరినీ ఆడనివ్వను ?
Advertisement

Gautam Gambhir: భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం రోజు విశాఖపట్నం వేదికగా జరిగిన మూడవ వన్డేలో టీమ్ ఇండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ని 2- 1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంలో విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మలు మరోసారి అద్భుత ప్రదర్శన చేసి తమ విలువను నిరూపించుకున్నారు. ఈ సిరీస్ కి ముందు సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే.

Also Read: Ind vs Sa 3rd Odi: చెత్త బౌలర్ అంటూ ట్రోలింగ్.. బంతితో ప్రసిద్ అదిరిపోయే కౌంటర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Advertisement

కానీ తాజాగా జరిగిన వన్డే సిరీస్ ని మాత్రం భారత్ కైవసం చేసుకుంది. దీంతో గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి ఈ సిరీస్ విజయం ఎంతో ఊరటను కలిగించింది. అయితే టెస్ట్ క్రికెట్ ప్రదర్శనపై వస్తున్న విమర్శల గురించి గౌతమ్ గంభీర్.. మూడవ వన్డే అనంతరం. ముఖ్యంగా గౌతమ్ గంభీర్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

 

రోహిత్ – కోహ్లీలపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు:

Advertisement

మూడవ వన్డే మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ” వారిద్దరూ భారత్ తరపున చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నారు. వారిద్దరూ రాబోయే రోజుల్లో కూడా వైట్ బాల్ ఫార్మాట్ లో మరింత మెరుగ్గా ఆడుతూనే ఉంటారని ఆశిస్తున్నాను”. అన్నాడు. అయితే రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడతారా..? అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ” వచ్చే ప్రపంచ కప్ కి మరో రెండేళ్ల సమయం ఉందని మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతం ఆట గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. యువ ఆటగాళ్లు ఇప్పుడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు”. అని స్పష్టం చేశాడు. దీంతో రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ లు 2027 వరల్డ్ కప్ ఆడడంపై గ్యారెంటీ ఇవ్వలేదు.

 

రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్తుపై చర్చ:

గత మూడు నెలలుగా రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై క్రికెట్ వర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీం మేనేజ్మెంట్, సెలక్టర్లు 2027 వన్డే ప్రపంచ కప్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇద్దరినీ పక్కన పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. కానీ రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ వరుసగా రెండు వన్డే సిరీస్ లలో భారత జట్టుకు అత్యుత్తమ బ్యాటర్లుగా నిలిచి.. వారిపై వస్తున్న అన్ని అనుమానాలకు వారి ప్రదర్శనలతో సమాధానం చెప్పారు.

Also Read: Ind vs Sa 3rd Odi: టీమిండియా ఓడిపోవాలని క్షుద్ర పూజలు.. తెరపైకి కొత్త స్వామీజీ

ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండు వన్డే సిరీస్లలో రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ నిలకడైన ప్రదర్శనతో.. జట్టులో వారి ప్రాముఖ్యతను స్పష్టంగా రుజువు చేశారు. దీంతో వీరిని జట్టు నుంచి తొలగించడం అనేది ప్రస్తుతం అసాధ్యంగా మారింది. కానీ తాజాగా గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులలో చర్చనీయాంశంగా మారాయి. 2027 వన్డే వరల్డ్ కప్ లో రో-కో ల కాంబినేషన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు కోచ్ గౌతమ్ గంబీర్ వ్యాఖ్యలు అసహనాన్ని కలిగిస్తున్నాయి.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×