BigTV English
Advertisement

Virat Kohli Completes 8000 Runs in IPL: పరుగుల విరాట్ @ 8కె.. ఐపీఎల్ లో నెంబర్ వన్ క్రికెటర్ గా రికార్డ్

Virat Kohli Completes 8000 Runs in IPL: పరుగుల విరాట్ @ 8కె.. ఐపీఎల్ లో నెంబర్ వన్ క్రికెటర్ గా రికార్డ్
Virat Kohli Becomes First Batter to Reach 8000 Runs in IPL History: ఇండియన్ క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ లోనే విరాట్ కొహ్లీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. క్రికెట్ ఆట బతికి ఉన్నంతకాలం తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు కొత్తగా వచ్చే ఎంతోమందికి తను ఒక సిలబస్ గా మారిపోయాడు. 35 ఏళ్ల వయసులో కూడా అద్భుతంగా ఆడుతూ, ఫిట్ నెస్ కి మారుపేరుగా నిలుస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచే విరాట్ కొహ్లీ నేడు ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 8000 పరుగుల మైలు రాయిని దాటిని తొలి బ్యాటర్ గా అవతరించాడు.

రాజస్థాన్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు..8000 పరుగులకు 29 పరుగుల దూరంలో కొహ్లీ నిలిచాడు.. ఈ క్రమంలో 24 బంతుల్లో 33 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అలా 8 వేల మార్కును దాటేశాడు. మొత్తంగా ఐపీఎల్‌లో కోహ్లీ ఇప్పటివరకు 252 మ్యాచ్‌ల్లో 8004 రన్స్ చేశాడు. 38.67 సగటు, 131.97 స్ట్రైక్ రేట్‌ ఉంది. ఐపీఎల్‌లో మొత్తంగా 8 శతకాలు చేసిన విరాట్ ఇక్కడా టాప్‌లోనే ఉన్నాడు. ఇక 90ల్లో అవుట్ అయి, సెంచరీలు మిస్ అయినవి చాలా ఉన్నాయి.


Also Read: ఓపెనర్ గా రావాలా? లేక ఫస్ట్ డౌన్ రావాలా? కొహ్లీపై నెట్టింట చర్చ

అయితే 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే, కొహ్లీ దరిదాపుల్లో మరెవరూ అంత దగ్గరగా లేరు. ఇకపోతే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ మాత్రం 6769 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత రోహిత్ శర్మ (6628), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528) తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నారు.


రైనా రిటైర్ అయిపోయాడు. శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ కూడా మరో రెండేళ్లు ఆడితే ఎక్కువే అని చెప్పాలి.  ఈ క్రమంలో కొహ్లీ కూడా ఐపీఎల్ లో 10వేల పరుగులు పూర్తి చేసి రిటైర్ అవుతాడని అభిమానులు అనుకుంటున్నారు. అందుకని ఇప్పుడప్పుడే కొహ్లీ రికార్డ్ చెదిరిపోయే అవకాశాలు కనిపించడం లేదు.

ఇక విరాట్ కొహ్లీ 2024 ఐపీఎల్ సీజన్ లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.  మొత్తం 15 మ్యాచ్‌ల్లో 741 రన్స్‌తో నెంబర్ వన్ గా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ తనకే దక్కేలా ఉంది.  61.75 సగటు, 154.70 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ మొత్తం పరుగుల్లో 62 ఫోర్లు, 38 సిక్సర్లు  కొట్టాడు.

ఈ రన్స్ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 583 పరుగులతో , గుజరాత్ నుంచి సాయి సుదర్శన్ (527) దగ్గరలో ఉన్నారు. ఆల్రడీ ఈ జట్లు లీగ్ నుంచి బయటకి వచ్చేశాయి.ఇక మిగిలింది… రాజస్థాన్ నుంచి రియాన్ పరాగ్ (567), హైదరాబాద్ నుంచి ట్రావిస్ హెడ్ (533) ఉన్నారు. వీరిలో ఒక జట్టు ఎలాగూ బయటకి వచ్చేస్తుంది. దాంతో మిగిలిన ఒక్కరు కొహ్లీ కొట్టిన 741 చేయాలంటే దాదాపు అసాధ్యమని అంటున్నారు. మరేం జరుగుతుందో, కొహ్లీ రికార్డుని ఎవరు దాటుతారో వేచి చూడాల్సిందే.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×