E-Paper
Advertisement

విమర్శలు, అవమానాలే మమ్మల్ని నడిపించాయి.. టీవీకే అధినేత విజయ్ భావోద్వేగ ట్వీట్!

విమర్శలు, అవమానాలే మమ్మల్ని నడిపించాయి.. టీవీకే అధినేత విజయ్ భావోద్వేగ ట్వీట్!
Advertisement

Vijay TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ తన గెలుపుపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేర‌కు ఒక భావోద్వేగపూరితమైన లేఖను విడుదల చేశారు. ఈ విజయం కేవలం ఒక పార్టీది మాత్రమే కాదని.. తమిళ ప్రజల గుండెల్లో నిండిన మార్పు ఆకాంక్షకు దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రస్థానం మొదలైన తొలి నాటి నుంచి తమను చూసి ఎగతాళి చేసిన వారు.. విమర్శలు సంధించిన వారు ఎందరో ఎదురయ్యారని.. వాటన్నింటినీ పక్కన పెట్టి కేవలం ప్రజలనే నమ్ముకుని ఎన్నికల రణరంగంలో నిర్భయంగా నిలబడ్డామని విజయ్ స్పష్టం చేశారు.

“విమర్శ” అనే మాటున తమకు ఎదురైన నిందలు, అవమానాలను లెక్కచేయకుండా ముందుకు సాగామని విజయ్ వివరించారు. ఎవరి రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చామో ఆ తమిళనాడు ప్రజలు తమపై ఒక తల్లిలా నిస్వార్థమైన ప్రేమను కురిపించారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అందించిన భారీ తీర్పు భారత రాజకీయాల్లోనే పెను ప్రకంపనలు సృష్టించిందని.. ఇది ఒక అద్భుతమైన ఎన్నికగా నిలుస్తుందని తాను ముందే ఊహించానని.. అది ఇప్పుడు నిజమైందని సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

ఈ భారీ విజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ.. తమ చిన్నారులు.. పిల్లలు తమ కుటుంబాలను సరైన దిశలో నడిపించడం అత్యంత కీలకమైన అంశమని విజయ్ అభిప్రాయపడ్డారు. తమిళ ప్రజల హృదయాల్లో బలంగా నాటుకున్న భావోద్వేగ ప్రజాస్వామ్యం ఘనవిజయం సాధించిందని ఆయన ప్రకటించారు. ఏళ్ల తరబడి రాష్ట్రంలో ఆధిపత్య రాజకీయ సంస్కృతిగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అవినీతి ధనస్వామ్యం ఇప్పుడు వేళ్లతో సహా పెకిలించబడి.. శాశ్వతంగా సమాధి చేయబడిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

తమిళనాడులో మార్పును నడిపించే ప్రధానమైన.. శక్తివంతమైన శక్తిగా తమ పార్టీ నిలుస్తుందని ఈ ఫలితం బలంగా నిరూపించిందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు అసాధ్యమని భావించిన ఈ రాజకీయ విజయాన్ని సాకారం చేసిన తన సొంత ప్రజలకు జీవితకాల కృతజ్ఞతలు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ సహచరులకు.. క్షేత్రస్థాయి కార్యకర్తలకు.. అజ్ఞాతంగా పోరాడిన వర్చువల్ యోధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేయడం మరిచిపోయిన వారు కూడా రాబోయే కాలంలో తమను మరింత గాఢంగా ప్రేమిస్తారని ఆశిస్తున్నట్లు విజయ్ తన సందేశంలో పేర్కొన్నారు.

Advertisement

Read Also: గెలుపు సరే.. రాజకీయ కుట్రల సంగతి ఏమిటీ? విజయ్ ముందున్న అసలు సవాళ్లు ఇవే!

Related News

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Big Stories

Advertisement
×