BigTV English

Virat Kohli : సోషల్ మీడియాలో వార్తలు.. కోహ్లీ బ్రదర్ సీరియస్..

Virat Kohli : సోషల్ మీడియాలో వార్తలు.. కోహ్లీ బ్రదర్ సీరియస్..

Virat Kohli : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌కు, మొదటి రెండు టెస్టులకు విరాట్ కొహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి తొలిటెస్ట్‌లో టీమ్ ఇండియా గానీ విజయం సాధించి ఉంటే, కొహ్లీ గైర్హాజరీని ఎవరూ పెద్దగా లెక్కలోనికి తీసుకునే వారు కాదు. కానీ ఓటమి పాలు కావడం, అదీ సీనియర్ లేని లోటు స్పష్టంగా తెలియడంతో అందరూ కొహ్లీపై ఫోకస్ పెట్టారు.


అసలెందుకు? కొహ్లీ సెలవు పెట్టాడు. మొన్న కూడా అలాగే ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన తొలి టీ 20లో ఆడలేదు. ఇప్పుడు తొలి రెండు టెస్టులకి ఎగనామం పెట్టాడు. కారణం ఏమై ఉంటుందని అంటున్నారు. రకరకాల దారుల్లో వెతికేస్తున్నారు. 

 ఒక వైపు నుంచి భార్య అనుష్క ఆసుపత్రిలో ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు పెద్ద కూతురు వామిక బాధ్యత చూడాల్సి వచ్చిందని, తల్లి అనుష్క దగ్గర లేకపోతే, తండ్రి కూడా లేకపోతే ఎలాగని కొందరు కామెంట్ చేస్తున్నారు.


మరికొందరు మరో అడుగు ముందుకేసి అసలు కొహ్లీ అమ్మగారికే బాగా లేదు. అందుకే తను ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందని వార్తలు గట్టిగానే షికారు చేస్తున్నాయి. ఇవన్నీ చూసిన కొహ్లీ సోదరుడు వికాస్ కొహ్లీ సీరియస్ అయ్యాడు. ముందు ఆ ఫేక్ వార్తలని ఆపమని సోషల్ మీడియాను కోరాడు. మా అమ్మగారు బంగారంలా ఉన్నారని తెలిపాడు. ఆమె ఆరోగ్యం చక్కగా ఉంది, ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదని అన్నాడు.

ఎంత సెలబ్రిటీ కుటుంబమైనా సరే, వారికి కూడా కొంచెం ప్రైవసీ కావాలని, వారు మనుషులే, అందరూ అర్థం చేసుకోవాలనే భావనతో వ్యాక్యానించాడు. ఈ విషయంలో హద్దులు దాటుతున్న సోషల్ మీడియాపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అని ఉంటాయి. 

పబ్లిక్ లోకి వచ్చినప్పుడు లేదా వారు క్రికెట్ ఆడినప్పుడు ఇలా వార్తలు రాయవచ్చు గానీ, వారి ప్రైవేటు లైఫ్ లోకి చొరబడటం, ఆ విషయాలను పదిమందిలో పెట్టడం కరెక్ట్ కాదని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×