BigTV English

Interim Budget 2024 : ఎన్నికల వేళ నిర్మల బడ్జెట్..!

Interim Budget 2024 : ఎన్నికల వేళ నిర్మల బడ్జెట్..!

Interim Budget 2024 : ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలతో సార్వత్రిక ఎన్నికల ముందు యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మధ్యంతర బడ్జెట్ 2024-25 మరికొద్ది సేపట్లో పార్లమెంట్ ముందుకు రాబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మోదీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. ప్రస్తుత లోక్‌సభకు ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో ఎలాంటి ప్రకటనలు వెలువడుతాయన్న ఉత్కంఠ సర్వత్రా ఆసక్తి నెలకొంది.


అయితే ఈ మధ్యంతర బడ్జెట్‌లో కావడంతో పెద్దగా విధానపరమైన ప్రకటనలు ఉండకపోవచ్చే విశ్లేషణలు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఎన్నికలపరంగా ముఖ్యమైన రైతులు, మహిళలకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. 11 గంటలకు పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జి దేశాయ్ సరసన ఆమె నిలవనున్నారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. డిజిటల్‌ రూపంలోనే బడ్జెట్‌ సమర్పించనున్నారు. ఉదయం కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకోనున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. బడ్జెట్ కు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్రపతికి వివరించారు. అనుమతి తీసుకున్నాక నేరుగా పార్లమెంట్ కు వెళ్లి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఎన్నికల ఏడాదిలో ప్రవేశపెడుతున్న ఈ బడ్దెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


కాగా.. వరుసగా ఆరోసారి బడ్జెట్​ను ప్రవేశపెట్టి అరుదైన ఘనత సాధించనున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ఎన్నికలపరంగా ముఖ్యమైన రైతులు, మహిళలకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చన్న అంచనాలున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×