Virat Kohli Net Worth : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ నిన్ననే టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ అయిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ లేని మ్యాచ్ లను ఇక చూడలేమంటూ అభిమానులు పేర్కొనడం గమనార్హం. విరాట్ కోహ్లీ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నంత సేపు అపోజిట్ టీమ్ కి దఢ పుడుతుంది. విరాట్ కోహ్లీ తన 36 ఏళ్ల వయస్సులో టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. భారత క్రికెట్ లో ఒక కీలక ఘట్టాన్నే సూచిస్తుంది. జూన్ 20, 2025న ప్రారంభం కాబోయే ఇంగ్లండ్ లో భారత్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కి కొద్ది రోజుల ముందే విరాట్ కోహ్లీ నుంచి ఈ నిర్ణయం వచ్చింది.
విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో లేఖను షేర్ చేశాడు. క్రికెట్ లో తాను ఎత్తు పల్లాలను ఎదుర్కొన్నానని.. వ్యక్తిగత, వృత్తి పరమైన ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ.. కలిగి ఉన్నవన్నీ రాసుకొచ్చాడు. ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లీ ప్రకటన.. భారత క్రికెట్ లో ఒక శకం ముగిసిందని సూచిస్తోంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ కావడం.. ఆ తరువాత వెంటనే కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం ఇప్పుడు టీమిండియా క్రికెట్ లో ఆసక్తికర సంఘటన అనే చెప్పాలి. ముఖ్యంగా టీమిండియా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం.. టీమిండియాకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు. తాజాగా ఓ నివేదిక ప్రకారం.. విరాట్ కోహ్లీ 1050 కోట్ల నికర విలువలతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంపన్న క్రీడ ప్రముఖుల జాబితాలో ఉన్నాడు. అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్కశర్మ నికర విలువ రూ.255 కోట్లు.
విరాట్ కోహ్లీకి ప్రస్తుతం ఏ+ jకాంట్రాక్ట్ ఉంది. ఈ లెక్కన ఏడాదికి రూ.7 కోట్ల జీతం వస్తుంది. మ్యాచ్ ఫీజులు అదనం.. టెస్ట్ మ్యాచ్ కి రూ.15లక్షలు, వన్డే మ్యాచ్ కి రూ.6లక్షలు, టీ-20 మ్యాచ్ కి రూ.3లక్షల మ్యాచ్ ఫీజు తీసుకుంటున్నాడు. తాజాగా టెస్ట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ 20లకు కూడా గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విరాట్ కోహ్లీ 2008 నుంచి ఐపీఎల్ లో ఆర్సీబీకి ఆడుతున్నాడు. రూ.12లక్షలతో తన ఐపీఎల్ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన కోహ్లీ.. ఇప్పుడు రూ.21కోట్ల వేతనం అందుకుంటున్నాడు. 18 ఏళ్లలో ఐపీఎల్ ద్వారానే రూ.212 కోట్లు సంపాదించాడు. ఈ ఆదాయం కాకుండా విరాట్ కోహ్లీ చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. కొన్ని కంపెనీలను కూడా ప్రారంభించారు. కోహ్లీ నెట్ ప్రస్తుతం రూ.1050 కోట్లు అని తెలుస్తోంది. భారత్ లోనే అత్యంత ధనిక క్రీడాకారుడు విరాట్ కోహ్లీ. అలాగే బ్లూ స్టార్, ఎంఆర్ఎఫ్, పూమా వంటి కంపెనీలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు కోహ్లీ. డిజిట్ ఇన్సూరెన్స్‌తో పాటు బ్లూ ట్రైబ్, వ్రాగన్, చిసెల్ ఫిట్‌నెస్, 18 అనే కంపెనీలను ప్రారంభించాడు. ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ మరిన్ని ఉత్పత్తులతో ఒప్పందం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
విరాట్ కోహ్లీ తీసుకునే ఫుడ్ :
విరాట్ కోహ్లీ తన ఫిట్ నెస్ కాపాడుకోవడానికి ఒక నిర్దిష్టమైన ఫుడ్ ని అనుసరిస్తాడు. ప్రధానంగా శాఖాహారం కలిగి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా ప్రోటీన్లు, ఆకుకూరలు, గ్రీన్ టీ, నిమ్మరసం, సలాడ్లు తీసుకుంటాడు. అయితే తన ఫుడ్ లో మసాలా, ఉప్పును చాలా తక్కువగా తీసుకుంటాడు. కోహ్లీ తన ఆహారంలో 90 శాతం ఉడికించిన ఆహారాలను మాత్రమే తీసుకుంటాడు. ఫ్రై లకు చాలా దూరంగా ఉంటాడు.